దేశ విధానాలకు అనుగుణంగా కంటెంట్: గూగుల్!!

Posted By: Staff

దేశ విధానాలకు అనుగుణంగా కంటెంట్: గూగుల్!!

 

ఆయా దేశాల విధానాలకు అనుగుణంగా తమ బ్లాగుల్లోని కంటెంట్ కు నియంత్రణ విధించాలని ఇంటర్నెట్ సెర్ఛ్ఇంజన్ గూగుల్ నిర్ణయం తీసుకంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలలను ఈ అంతర్జాల దిగ్గజం సిద్ధం చేసింది. బ్లాగర్ ద్వారా గూగుల్ సంస్థ బ్లాగింగ్ సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా ప్రణాళిక ప్రకారం.. ఉదాహరణకు ఏదైనా బ్లాగు .. న్యూజిలాండ్ చట్టాలను అతిక్రమించిన పక్షంలో గూగుల్ దాన్ని ఆ దేశంలో బ్లాక్ చేస్తుంది. అయితే, ఇతర దేశాల్లో మాత్రం దానిపై నిషేధం ఉండదు కనుక వేరే దేశాల్లోని నెటిజన్లు ఆ బ్లాగును వీక్షించవచ్చు. భారత్‌తో పాటు, బ్రెజిల్, జర్మనీ తదితర దేశాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని గూగుల్ తెలిపింది. ఒకవైపు భావప్రకటన స్వేచ్ఛకు వేదికగా ఉపయోగపడుతూనే మరోవైపు ఆయా దేశాల చట్టాలకు కూడా లోబడి పనిచేసేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని గూగుల్ పేర్కొంది. ఇందుకోసం తగు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.

మరోవైపు, మహిళా ఎంట్రప్రెన్యూర్స్ కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆన్ ది వెబ్’ (డబ్ల్యూఈవోడబ్ల్యూ) ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు గూగుల్ తెలిపింది. ఆన్‌లైన్ మాధ్యమంగా వ్యాపారావకాశాలపై అవగాహన పెంచుకునేందుకు, వాటిని అందిపుచ్చుకునేందుకు ఇది వారికి ఉపయోగపడుతుందని కంపెనీ వివరించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot