'కాఫీ డే'లో వై-పై ద్వారా గూగుల్ ప్లస్ ఫ్రీ.. ఫ్రీ

Posted By: Staff

'కాఫీ డే'లో వై-పై ద్వారా గూగుల్ ప్లస్ ఫ్రీ.. ఫ్రీ

 

ఇండియాలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ వాడకాన్ని మరింతగా పెంచేందుకు గాను గూగుల్ ఓ సరిక్రొత్త డీల్‌ని ప్రవేశెపట్టింది. ఓ-జోన్ నెట్‌వర్క్ అందించిన వై - ఫై ద్వారా యూజర్స్ సోషల్ మీడియా నెట్ వర్క్‌ సర్వీస్‌ని  ఫ్రీగా వినియోగించుకోవచ్చు. గూగుల్ ప్రకటించిన ఈ ఫ్రీ ఆఫర్ కేవలం యూజర్స్‌కు మూడు నెలలు పాటు అందించనుంది.

గూగుల్ ప్లస్‌ని అన్ లిమిటెడ్‌గా వాడినప్పటికీ,  వారానికి పది నిమిషాల పాటు గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే వేరే వెబ్ సైట్స్‌ని గనుక వాడినట్లేతే నిమిషానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇండియా మొత్తం మీద ఓ-జోన్ నెట్ వర్క్‌కి 5,000  వై - ఫై పాయింట్స్ ఉన్నాయి. ఈ 5,000 పాయింట్స్‌లలో కాఫీ డే, మెక్ డోనాల్డ్స్, కేఫ్ ఓజడ్, కాఫీ బీన్, టీ లీఫ్, కోస్టా కాఫీ, సబ్ వే, ఓమ్ బుక్ షాప్ లాంటి షాప్స్ కూడా ఉండడం విశేషం. కాబట్టి యూజర్స్ ఎప్పుడైనా కాఫీ డేలలో కాఫీ తాగేందుకు వెళితే ఫ్రీగా వై - పైని యాక్సెస్ చేసుకోని, సోషల్ మీడియా వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌కి కనెక్ట్ అవ్వోచ్చు.

సెర్చ్ ఇంజన్ గూగుల్ మాత్రం సోషల్ మీడియా వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేస్తుండగా, ఓ-జోన్ సీఈవో సంజీవ్ సారిన్ మాత్రం ఇలా చేయడం వల్ల  ఇండియాలో వై - ఫైకి మరింత ఆదరణ లభిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఓ-జోన్ యూజర్స్‌కు నాణ్యమైన నెట్ వర్క్‌ని అందిస్తుందని అన్నారు. ఇటీవల కాలంలో ఓ-జోన్ నెట్ వర్క్ రిజిస్ట్రేషన్స్  30 శాతం వరకు పెరిగాయని అన్నారు. 2013వ సంవత్సరానికి గాను దేశం మొత్తం మీద 50,000 హాట్ స్పాట్స్ కి చేరుకోవాలని గోల్‌గా పెట్టుకున్నామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot