లేటెస్ట్‌ ట్రెండ్... మొబైల్స్‌లలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ కొత్తగా...

Posted By: Super

లేటెస్ట్‌ ట్రెండ్... మొబైల్స్‌లలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ కొత్తగా...

నేటి యూత్‌ ఎక్కడికెళ్లినా సెల్‌ఫోన్‌ను వెంటపెట్టుకొని వెళ్తున్నారు. సెల్‌లో ప్రతి విషయాన్ని ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తూ కొందరు యువతీ యువకులు ఎల్లప్పుడూ బిజీగా కనిపిస్తుంటారు.ఈ నేపథ్యంలో మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సెల్‌ ఫోన్‌లు వస్తున్నాయి. సెల్‌లో వివిధ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్ల ద్వారా ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తూ యువత ఆనందాన్ని పొందుతోంది. ఈ మేరకు సెల్‌ కంపెనీలు యువత కోసం మొబెైల్‌లో పలు ఆధునిక సౌకర్యాలను పొందు పరుస్తున్నాయి.

ఒకప్పుడు సెల్‌ఫోన్‌లను కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వినియోగించేవారు. కానీ నేడు సెల్‌ఫోన్‌లను కేవలం మాట్లాడుకోవడానికే కాదు పలు అత్యాధునిక సౌకర్యాల కోసం సైతం ఉపయోగిస్తున్నారు. వివిధ కంపెనీలు ఈ మేరకు అనేక ఆధునిక సౌకర్యాలను మొబైల్‌లో పొందుపరుస్తున్నాయి. ప్రస్తుతం సెల్‌లో కెమెరా, మెయిల్స్‌, మ్యూజిక్‌, నెట్‌, మల్టీ మీడియా తదితర సౌకర్యాలు ఉంటున్నాయి. లేటెస్ట్‌గా సెల్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ కొత్త ట్రెండ్‌గా మారింది.

కొత్త జనరేషన్‌ సెల్‌లు...

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేరకు నేడు సెల్‌లో కొత్త జనరేషన్‌ మొబెైల్స్‌ వస్తున్నాయి. వీటిలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ను పొందుపరుస్తున్నారు. వీటిని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఫోన్‌లు అని అంటున్నారు. బ్రాండెడ్‌ కంపెనీలైన ఎల్‌ జి, సోనీ ఎరిక్సన్‌, సామ్‌సంగ్‌తో పాటు మైక్రోమ్యాక్స్‌, ఐఎన్‌క్యూ ఫోన్‌లలో ఈ అత్యాధునిక సౌకర్యం ఉంటోంది. ఈ కంపెనీ లు ప్రత్యేకంగా వీటిలో కొన్ని మోడల్స్‌ను సైతం విడు దల చేస్తున్నాయి. ఎల్‌జి కుకీ పెప్‌, ఐఎన్‌క్యూ ఛాట్‌ 3జి, మైక్రోమ్యాక్స్‌ ఫేస్‌బుక్‌ ఫోన్‌లు ఇటువంటి మోడల్సే. వీటిలో అత్యాధునిక సోషల్‌ నెట్‌వర్కింగ్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఫేస్‌ బుక్‌ అక్కౌంట్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం, ఫ్లికర్‌ ద్వారా కొత్త పిక్చర్స్‌ను అప్‌లోడ్‌ చేసుకోవడం తదితరాలన్నీ వీటిలో చేసుకోవచ్చు. ఇక యూ ట్యూబ్‌ ద్వారా లేటెస్ట్‌ వీడియోను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం వంటి సౌకర్యాలు యూత్‌ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

పెరుగుతున్న డిమాండ్‌...

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఫోన్‌లకు రోజు, రోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ మేరకు పలు కొత్త మొబెైల్స్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటర్నెట్‌ సౌకర్యంతో వస్తున్న ఈ సెల్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో ఈ-మెయిల్‌ సౌకర్యాలను పొందుపరుస్తున్నారు.ఇటువంటి మొబెైల్స్‌నే ప్రజలు ఇష్టపడుతున్నారని ఎయిర్‌టెల్‌ సిఒఒ గురుదీప్‌ సింగ్‌ అన్నారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఉన్న కొన్ని ఫోన్లు ప్రత్యేకంగా రూపు దిద్దుకుంటున్నాయి. మైక్రోమ్యాక్స్‌ క్యూ5లో ఎఫ్‌బి అని ప్రత్యేకంగా బటన్లు ఉంటున్నాయి. ఎఫ్‌బి అంటే ఫేస్‌బుక్‌ అని అర్థం.

ఎల్‌జి కుకీ పెప్‌లో ప్రత్యేకంగా సోషల్‌ నెట్‌వర్క్‌ విడ్జెట్స్‌ ఏర్పాటయ్యాయి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యూజర్స్‌ నేడు బాగా పెరుగు తున్నారు. ఈ మేరకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఫీచర్స్‌ ఉన్న ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతోంది అని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ ఇండియా బిజినెస్‌ గ్రూప్‌ హెడ్‌ సుధిన్‌ మాథుర్‌ అన్నారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెల్‌ వినియోగదారులు మరింత బాగా కాంటాక్ట్‌లో ఉండేందుకు వీలవుతోందని ఆయన అన్నారు.

అందుబాటు ధరలలో...

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఫోన్‌లు సామాన్య ప్రజలకుసైతం అందుబాటులో ఉం డే ధరలలో లభ్యమవుతుండడం విశేషం. వీటిలో అత్యాధునిక టచ్‌ స్క్రీన్‌లు, క్వర్టీ కీ ప్యాడ్స్‌, కెమెరాలు సైతం ఉంటున్నాయి. మైక్రోమ్యాక్స్‌ ఫేస్‌ బుక్‌ ఫోన్‌ ధర రూ.4,000, ఎల్‌జి కుకీ జాప్‌ ధర రూ.7,500, ఐఎన్‌క్యూ ఛాట్‌ 3జి ధర రూ.7,300గా ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot