2012 నుండి 'గూగుల్ వాయిస్ ప్రీ కాల్స్‌' ఫ్రీగా..

Posted By: Staff

2012 నుండి 'గూగుల్ వాయిస్ ప్రీ కాల్స్‌' ఫ్రీగా..

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కెనడా, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న యూజర్స్‌కి ముందుగా హాలీడే గిప్ట్‌ని అందించనుంది. ఇంతకీ గూగుల్ అందించనున్న ఈ హాలీడే గిప్ట్ ఏంటని అనుకుంటున్నారా.. గూగుల్ అభిమానుల కోసం వాయిస్ ప్రోడక్ట్ అంటే వాయిస్ కాల్స్ ఫీచర్‌ని ఫ్రీగా అందించనుంది. గూగుల్ వాయిస్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ 'విన్సెంట్ పాట్' మాట్లాడుతూ 2012 కొత్త సంవత్సరం సందర్బంగా కెనడా, యునైటెడ్ స్టేట్స్‌లలో ఉన్న గూగుల్ యూజర్స్ కోసం  ప్రత్యేకంగా హాలీడే సెలబ్రేషన్స్‌ని దృష్టిలో పెట్టుకోని, గూగుల్ వాయిస్ ప్రీ కాల్స్‌ని అందిస్తున్నామని అన్నారు.

ఈ ఫీచర్ సహాయంతో వేరు వేరు ప్రదేశాలలో నివసిస్తున్న గూగుల్ యూజర్స్ తమయొక్క స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫ్రీ గా వాయిస్ కాల్స్‌తో మాట్లాడొచ్చని అన్నారు. గూగుల్ వాయిస్ ఫీచర్ యుఎస్, కెనడాలలో 2010వ సంవత్సరం నుండి అందుబాటులో ఉన్నప్పటికీ, సడన్‌గా 2011 ఆగస్టు నెలలో సెర్చ్ ఇంజన్ గెయింట్ ఈ ఫీచర్‌ని తీసివేయనున్నామని ప్రకిటించిన సంగతి తెలిసిందే.

ఐతే క్రిస్‌మస్ పండుగను దృష్టిలో పెట్టుకొని మరలా ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకోని రావడం జరిగింది. క్రిస్ మస్ సంబరాలను దృష్టిలో పెట్టుకోని చాలా మంది గూగుల్ యూజర్స్ ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవడమే కాకుండా, మిగిలిన గూగుల్ సర్వీస్‌లను ఉపయోగించి తమయొక్క సన్నిహితులకు, స్నేహితులకు గ్రీటింగ్స్, గిప్ట్‌లు పంపేందుకు వెసులుబాటు కల్పించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot