గూగుల్ వాయిస్ సెర్చ్ ఇంజన్ ఫీచర్ అదుర్స్, మాటలతో సెర్చ్ చేయండి

Posted By: Super

గూగుల్ వాయిస్ సెర్చ్ ఇంజన్ ఫీచర్ అదుర్స్, మాటలతో సెర్చ్ చేయండి

కాలిఫోర్నియా: గూగుల్ ప్రత్యేకతలకు నాంది. గూగుల్ కంపెనీ ఏమి చేసినా అందులో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. గూగుల్ క్రోమ్వాడేటటువంటి కస్టమర్స్ కోసం సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచర్‌ని విడుదల చేసింది. ఈ విషయాన్ని గూగులే స్వయంగా శ్యాన్ ఫ్రాన్సికోలో జరిగినటువంటి స్పెషల్ ఈవెంట్‌లో డెస్క్‌టాప్‌కు సంబంధించి వాయిస్ సెర్చ్ ఫీచర్‌ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త సెర్చ్ ఫీచర్ వల్ల ఏఏ యూజర్స్ ఇప్పటి వరకు టైపింగ్ చేస్తున్నారో ఇక మీదట అలా లేకుండా మట్లాడి వారియొక్క సెర్చ్ రిక్వెస్టులను పంపవచ్చునని తెలిపారు.

వీటితోపాటు గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ఓ సరిక్రొత్త మైక్రోఫోన్‌ని ప్రవేశపెట్టింది. యూజర్స్ ఎవరైతే వాయిస్ ఫీచర్‌ని ఉపయోగించాలని అనుకుంటున్నారో వారు ఈ మైక్రోఫోన్‌పై క్లిక్ చేసి వారియొక్క వాయిస్‌ని వినిపించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కేవలం ఒక్క గూగుల్ క్రొమ్ బ్రౌజర్‍‌‌లో మాత్రమే వస్తుంది. ఐతే ఈ గూగుల్ సెర్చ్ వాయిస్ ఫీచర్ త్వరలో మిగిలినటువంటి బ్రౌజర్స్‌లో కూడా రాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వన్ ఇండియా రీడర్స్ కోసం ప్రత్యేకంగా...


దీనితోపాటు గూగుల్‌ తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, తమిళ భాషల్ని బుధవారం 'అనువాద' విభాగంలో చేర్చిందని గూగుల్‌ శాస్త్రవేత్త ఆశిష్‌ వేణుగోపాల్‌ తెలిపారు. ''ఇప్పటికే హిందీ, మరాఠీ, మలయాళం, పంజాబీ భాషల్లో గూగుల్‌ అనువాద సేవలుఅందుతున్నాయి. వీటిని తాజాగా ఐదు భాషలకు విస్తరించడం ద్వారా మరో50 కోట్ల మందికి చేరువ కానున్నాం'' అని ఆశిష్‌ తెలిపారు. ఇకపై గూగుల్‌ translate సహాయంతో తొమ్మిది భారతీయ భాషల పదాలను మొత్తం 63 భాషల్లోకి అనువదించవచ్చని పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot