Home
News

భారత్‌లో అందుబాటులోకి గూగుల్ వ్యాలెట్‌.. ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.!

గూగుల్ సంస్థ భారత్‌లో గూగుల్‌ వ్యాలెట్‌ ను (Google Wallet in india) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా టికెట్లు, బోర్డింగ్‌ పాస్‌ లు, ఇతర కార్టులను భద్రపరుచుకొనేందుకు ఉపయోగపడుతుంది. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, లోయాల్టీ కార్డులు, మరియు గిఫ్ట్‌ కార్డులను భద్రపరుచుకోవచ్చు.

నాన్‌ పేమెంట్‌ అవసరాలకు మాత్రమే..! :
అయితే పేమెంట్లు సహా ఇతర ఆర్థిక అవసరాల కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్‌ పే యాప్‌నకు.. వ్యాలెట్‌ యాప్‌ ప్రత్యా్మ్నాయం కాదని సంస్థ స్పష్టం చేసింది. నాన్‌ పేమెంట్ అవసరాలకు మాత్రమే గూగుల్‌ వ్యాలెట్‌ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల పత్రాలను సులభంగా యాక్సెస్‌ చేయవచ్చని తెలిపింది.

Google wallet launched in india

ఇప్పటికే అనేక సంస్థలతో ఒప్పందం :
గూగుల్‌ వ్యాలెట్‌ కోసం ఇందుకోసం ఇప్పటికే గూగుల్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌, ఎయిర్ ఇండియా, మేక్‌ మై ట్రిప్‌, PVR, Inox సహా ఇతర అనేక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గూగుల్‌ వ్యాలెట్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది.

సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు :
గూగుల్‌ వ్యాలెట్ వేగవంతమైన మరియు మెరుగైన భద్రతను అందిస్తుందని గూగుల్‌ సంస్థ వెల్లడించింది. ప్రయాణాలు లేదా సినిమా థియేటర్లు సహా ఇతర ప్రాంతాల్లో సులభంగా డిజిటల్‌ పత్రాలు, టికెట్ల ను వినియోగించుకొనేందుకు అందుబాటులో ఉంటుంది.

పీవీఆర్‌ మరియు ఐనాక్స్‌ సంస్థలతో ఇందుకోసం గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫలితంగా యూజర్లు తమ సినిమా టికెట్ల ను సులభంగా ఇందులో భద్రపరుచుకోవచ్చు. అవసరం అయిన సమయాల్లో సులభంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్‌ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌ సహా Make My Trip మరియు Ixigo సంస్థల తోనూ అవగాహన కుదుర్చుకుంది.

ఫలితంగా ఆయా టికెట్లు, బోర్డింగ్‌ పాస్‌ లను సులభంగా గూగుల్‌ వ్యాలెట్‌ కు జతచేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌ కార్ట్‌, డోమినోస్‌ వంటి లోయాల్టీ, గిఫ్ట్‌ కార్టులను సులభంగా జతచేసుకోవచ్చు. దీంతోపాటు హైదరాబాద్‌ మెట్రో, కొచ్చి మెట్రో, VRL ట్రావెల్స్‌ మరియు అభి బస్‌ ట్రావెల్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ఆయా టికెట్లను ఈ వ్యాలెట్‌ లో స్టోర్‌ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ వ్యాలెట్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
తొలుత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్‌ను ఓపెన్‌ చెయ్యాలి. అనంతరం గూగుల్‌ వ్యాలెట్‌ ను సెర్చ్‌ చేసి డౌన్‌లోడ్‌ చేయాలి. అనంతరం ఇన్‌ స్టాల్‌ బటన్‌ పైన క్లిక్‌ చేయాలి. యాప్‌ అడిగిన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google wallet is now available in india here to know how to use
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X