పిషింగ్ మెయిల్స్‌ను గుర్తించేందుకు గూగుల్ క్విజ్
పిషింగ్ దాడుల పట్ల నెటిజనులను అప్రమత్తం చేసి వాటి పట్ల వారికి అవగహన కల్పించే ఉదేశ్యంతో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.
పిషింగ్ దాడుల పట్ల నెటిజనులను అప్రమత్తం చేసి వాటి పట్ల వారికి అవగహన కల్పించే ఉదేశ్యంతో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా గూగుల్ కంపెనీల్లో ఒకటైన జిగ్‌సా(Jigsaw) ఓ క్విజ్‌ను ఇంటర్నెట్‌లో పబ్లిష్ చేసింది. ఈ క్విజ్ పిషింగ్ మెయిల్స్ పట్ల నెటిజనులకు ఉన్న అవగాహను అంచనా వేస్తుంది. క్విజ్‌లో భాగంగా పలు రకాల మెయిల్స్‌ను చూపించి వాటిలో మంచిదేదో, చెడ్డదేదో గుర్తించమని అడుగుతారు. తద్వారా యూజర్ పరిజ్ఞానాన్ని అంచనా వేయటం జరుగుతుంది. ఈ క్విజ్‌లో మీరు కూడా పొల్గొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://phishingquiz.withgoogle.com/

ఈమెయిల్ అకౌంట్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి
ఈమెయిల్ అకౌంట్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఫిషింగ్ మెయిల్స్ అనేవి వస్తుంటాయి. టెక్నాలజీ పట్ల అవగాహన కలిగి ఉన్న చాలా మంది యూజర్లు ఇటువంటి మెయిల్స్ ను చూడగానే పసిగట్టేస్తారు. అవగాహన లేని వారు మాత్రం వీటి వలలో చిక్కుకుని డబ్బులు నష్టపోతూనే ఉంటారు. మెయిల్ సబ్జెక్ట్ లో Join Network, Resed Password, New Message, Add Me వంటి పదాలు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వెమయిల్స్‌ను ఫిషింగ్ మెయిల్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది.

మీకు పెద్దమొత్తంలో లాటరీ తగిలిందని ఫోన్ చేసి
మీకు పెద్దమొత్తంలో లాటరీ తగిలిందని ఫోన్ చేసి లేదా ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలు అడగటం ఇటీవల తరుచూ జరుగుతున్న మోసాల్లో మరొకటి. మొదట ఖాతా వివరాలు, పేరు, చిరునామా అడిగినట్లుగా నటిస్తారు. వివరాలు ధ్రువీకరించాల్సి ఉందంటూ కార్డునెంబరు, మీ పేరు చెప్పాల్సిందిగా తొందరపెడతారు. తర్వాత అకౌంట్, బ్రౌజర్ హ్యాక్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డు వివరాలను తెలుసుకుంటారు. కార్డు పరిమితి మేరకు ఖర్చు చేస్తారు. ఈమెయిల్ లేదా ఫోన్‌లో ఆర్‌బీఐ కానీ ఏ ఆర్థిక సంస్థలు ఈ వివరాలను తెలుసుకోవటానికి ప్రయత్నించరని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మెయిల్స్‌కు, ఫోన్ కాల్స్‌కు ప్రతిస్పందించకండి. ఇలాంటి మెయిల్స్ చూడగానే స్పామ్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని ఇలాంటి వాటిని భవిష్యత్తులో రాకుండా చూసుకోవచ్చు. అలాగే బ్రౌజర్‌కు కూడా పిషింగ్ ఫిల్టర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. మార్కెట్లో దొరికే యాంటి పిషింగ్ సాప్ట్‌వేర్‌లు మీ కంప్యూటర్‌లో ఉంచుకోవడం ద్వారా ఇలాంటి వాటి నుంచి జాగ్రత్త వహించవచ్చు.


Click it and Unblock the Notifications








