ఇంజినీరింగ్ విద్యార్థులకు గూగుల్ శిక్షణా తరగతులు

|

యువ విద్యార్థుల భవిష్యత్‌ను లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీస్ వైపుగా నడిపించే క్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ డే-లాంగ్ మొబైల్ డెవలపర్ ఫెస్ట్‌ను శుక్రవారం బెంగుళూరులో నిర్వహించింది.

 
ఇంజినీరింగ్ విద్యార్థులకు గూగుల్ శిక్షణా తరగతులు

దేశవ్యాప్తంగా 20 లక్షల మొబైల్ డెవలపర్స్‌కు శిక్షణనిచ్చే ఉద్దేశ్యంతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమాన్ని సీఎమ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో గూగల్ నిర్వహించింది. ఈ శిక్షణా కార్యక్రమాలను 12 రాష్ట్రాల్లోని లీడింగ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో గూగుల్ నిర్వహించబోతోంది.

టెక్నాలజీ నైపుణ్యాల విభాగంలో ఇండియా ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోందని, ఇక్కడి యువ విద్యార్థులు కొత్త టెక్నాలజీలను నేర్చుకునేందుకు ఉత్సాహంతో ఉన్నారని గూగుల్ యూనివర్శిటీ రిలేషన్స్ - ప్రొడక్ట్స్ గ్రూప్ డెవలపర్ విలియం ఫ్లోరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ డే-లాంగ్ ఫెస్ట్‌లో పాల్గొనే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెచీన్ లెర్నింగ్, ఫైర్ బేస్, ఆండ్రాయిడ్ అండ్ ప్రోగ్రెస్సివ్ వెబ్ యాప్స్ పై గూగుల్ అవగాహన కల్పిస్తోంది. ఈ ఫెస్ట్‌లో పాల్గొనే విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ ల్యాబ్స్ సెషన్స్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా గూగుల్ కల్పిస్తోంది.

4100mAh బ్యాటరీతో నోకియా2 వచ్చేసింది, కేవలం రూ. 6999కే !4100mAh బ్యాటరీతో నోకియా2 వచ్చేసింది, కేవలం రూ. 6999కే !

ఇటీవల బెంగళూరులో నిర్వహించిన యాప్ ఎక్స్‌లెన్స్ సమ్మిట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ 'Made for India' పేరుతో సరికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. భారతీయులకు అవసరమైన యాప్స్‌ను తయారు చేయటమే లక్ష్యంగా లాంచ్ కాబడిన ఈ ప్రోగ్రామ్ ద్వారా డెవలపర్స్‌కు తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశాన్ని గూగుల్ కల్పించింది.

ఇండియన్ డెవలపర్స్ కోసం రూపొందించబడిన ఈ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రత్యేకంగా కేటాయించబడిన సెక్షన్‌లో ఇండియన్ యాప్స్‌ను ప్రదర్శిస్తారు. ఇండియన్ డెవలపర్స్ డిజైన్ చేసిన హై-క్వాలిటీ యాప్స్‌కు ఈ సెక్షన్‌లో చోటు లభిస్తుంది. తమ యాప్‌ను మేడ్ ఫర్ ఇండియా సెక్షన్‌లో చూడాలనుకునే డెవలపర్స్ g.co/play/madeforindiaలోకి వెళ్లి సెల్ఫ్ నామినేషన్ ఫారమ్‌ను పూర్తి చేయవల్సి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Google launched a day-long Mobile Developer Fest in Bengaluru to train young students in the latest mobile technologies.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X