Home
News

తక్కువ ధరలో విమాన టికెట్లు బుక్ చేసుకోవాలా.. గూగుల్‌ మీకు సాయం చేస్తుంది..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం తన వినియోగదారుల కోసం కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Google Flights ద్వారా తక్కువ ధరకే టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్‌ విమాన టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు సరైన సమయం సహా ఇతర కీలక సూచనలు అందిస్తుంది. తన వద్దనున్న డేటా ఆధారంగా ఈ సలహాలు అందిస్తుంది.

గూగుల్ ఫ్లైట్స్‌లో కొత్త ఫీచర్‌ ఈ వారంలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. విహార యాత్రలకు వెళ్లే వారు ఏ సమయంలో విమాన టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయో కూడా సూచిస్తుంది. టికెట్లకు సంబంధించిన సరైన సమాచారం సహా సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ ఫీచర్‌ సహాయపడుతుంది.

Google will help to book flights

గూగుల్‌ ఫ్లైట్స్‌ ఫీచర్‌ ధరల ట్రాకింగ్‌ సహా అనేక విధాలుగా సాయం చేస్తుందని గూగుల్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. ఫ్రెండ్‌ పెళ్లి లేదా ఇతర పర్యటనలకు సంబంధించి ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. రానున్న మూడు నుంచి ఆరునెలల్లో టికెట్ల బుకింగ్‌ కోసం మంచి ఆఫర్లను సూచించడం సహా.. సరైన తేదీని కూడా చెబుతుంది.

తమ వద్ద ఉన్న కచ్చితమైన సమాచారం ఆధారంగా సరైన తేదీ, ఇతర వివరాలను పొందవచ్చని గూగుల్‌ వెల్లడించింది. విమాన టికెట్ల తగ్గింపు ధర కోసం ఎదురుచూస్తు్న్నట్లయితే ఈ గూగుల్‌ ఫ్లైట్స్‌ ట్రాకింగ్‌ను వినియోగించవచ్చు. మీరు ఎంచుకున్న మార్గాలు, తేదీల్లో ధరలు తగ్గితే ఈ ఫీచర్‌ అలెర్ట్‌ చేస్తుంది.

ఈ ఫీచర్‌ ద్వారా మీరు ఎంచుకున్న తేదీలు లేదా రానున్న మూడు నుంచి ఆరు నెలల వరకు తగ్గింపు ధరల సమాచారం పొందేలా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు వ్యక్తిగతంగా నిరంతరం తనిఖీ చేయకుండా ఈ ఫీచర్‌ టికెట్‌ ధర తగ్గినప్పుడు నోటిఫికేషన్‌ రూపంలో తెలియజేస్తుంది.

గూగుల్‌ ఫ్లైట్స్‌ ఫీచర్‌లో మరో ప్రత్యేకత ఉంది. దీని ద్వారా ఓ బ్యాడ్జ్‌ని పొందుతారు. గూగుల్‌ ఫ్లైట్స్‌ ఫీచర్‌ను విశ్వసించి అదే అత్యంత తక్కువ ధరగా భావించి టికెట్లు బుక్‌ చేసుకున్న తర్వాత ... మళ్లీ టికెట్‌ ధరలు తగ్గితే మీకు జరిగిన నష్టాన్ని గూగుల్‌ భర్తీ చేస్తుంది. గూగుల్ పే ద్వారా ఆ మిగిలిన మొత్తాన్ని మీకు బదిలీ చేస్తుంది.

మీరు క్రిస్మస్‌ సమయంలో ప్రయాణం చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లయితే.. అక్టోబర్‌ ప్రారంభంలో టికెట్లు బుకింగ్‌ చేసుకోవడం వల్ల తక్కువ ధరను పొందవచ్చు. ప్రయాణ తేదీ దగ్గర పడే వరకు వేచిచూడడం వలన తక్కువ ధరను పొందలేకపోవచ్చు. సాధారణంగా తక్కువ ధర విమానం టేకాఫ్‌కు 54 నుంచి 78 రోజుల మధ్య ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google will help to book flights in low cost with google flights feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X