Android OSలో తప్పు చూపిస్తే రూ.1.28 కోట్లు మీ సొంతం..

Judy మాల్వేర్ దెబ్బకు మరింత అప్రమత్తమైన గూగుల్...

|

బగ్ బౌంటీ హంటర్స్‌కు గూగుల్ భారీ నజరానాను ప్రకటించింది. తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో లోపాలను వెతికపట్టుకున్న వారికి $2,00,000 కంటే ఎక్కువ మొత్తంలో రివార్డ్స్ అందజేస్తామని గూగుల్ అనౌన్స్ చేసింది.

Android OSలో తప్పు చూపిస్తే  రూ.1.28 కోట్లు మీ సొంతం..

గూగుల్ ప్లే స్టోర్‌ను ఇటీవల Judy మాల్వేర్ వణికించిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లే లక్ష్యంగా ప్రోగ్రామ్ కాబడిన ఈ మాల్వేర్, గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్ ద్వారా ఫోన్‌లలోకి చొరబడగలిగింది. ఈ మాల్వేర్‌ను చెక్ పాయింట్ రిసెర్చర్లు కనుగొన్నారు. గూగుల్ డిటెక్షన్ మెకనిజంనే బురిడి కొట్టించగలిగిన Judy మాల్వేర్ గూగుల్ సెక్యూరిటీనే ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. దీంతో బిగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లను గూగుల్ మరంతగా ప్రోత్సహించాల్సిన పరిస్థితి వచ్చింది. బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లను మరింతగా ప్రోత్సహించే క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీలు ఇటీవల కాలంలో రివార్డ్ మొత్తాన్ని మరింతగా పెంచేస్తున్నాయి.

Android OSలో తప్పు చూపిస్తే  రూ.1.28 కోట్లు మీ సొంతం..

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రో‌సాఫ్ట్‌ కూడా హ్యాకర్లకు బంఫరాపర్ ప్రకటించింది. తమ సేవల్లో లోపాలుకనిపెట్టిన వారికి భారీ నజరానాను అందించనుంది. బగ్‌ పట్టు రూ.10 లక్షలు పట్టు అంటూ హ్యాకర్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఆన్‌లైన్‌ సేవల్లో తీవ్రమైన దాడులను, సెక్యూరిటీ లోపాలను గుర్తించిన హ్యాకర్లకు మొత్తం దాదాపు 20లక్షలు(30వేల డాలర్లు) దాకా చెల్లించనుంది. వీటిలో కనీసం500 డాలర్లుగాను, గరిష్టంగా 15 వేల డాలర్లు(రూ.10లక్షలు) నజరానా చెల్లిస్తామని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

Best Mobiles in India

English summary
Google Will Pay $200,000 For Finding A Bug In Android OS. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X