ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గిన గూగుల్.. డిలీట్ చేసిన యాప్‌లు తిరిగి ప్లేస్టోర్‌లోకి..!
భారత్‌కు చెందిన సుమారు 100 కుపైగా యాప్‌లను ప్లేస్టోర్ (Google Playstore) నుంచి తొలగించిన గూగుల్ తాజాగా ఈ వివాదంపై వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ జోక్యం సహా సుప్రీం కోర్టులో ఈ కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ఆయా యాప్‌లను ప్లేస్టోర్‌లోకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం జోక్యం, కోర్టులో పెండింగ్ కేసులు : గత శుక్రవారం గూగుల్ సంస్థ ప్రముఖ యాప్‌లు మ్యాట్రిమొని.కాం, భారత్ మ్యాట్రిమొని, నౌకరీ యాప్‌లు సహా 100 యాప్‌లను తొలగించింది. సర్వీస్ ఫీజుల చెల్లింపు వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం సహా దేశీయ స్టార్టప్‌ల విజ్ఞప్తులు, కోర్టు కేసులతో తాత్కాలికంగా వాటిని అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

గూగుల్ ఇండియా అధిపతితో కేంద్ర మంత్రి భేటీ..! : గూగుల్ ఇండియా అధిపతి సంజయ్ గుప్తాతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Union IT Minister Ashwini Vaishnaw) కీలక సమావేశం అనంతరం... గూగుల్ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే యాప్‌ల తొలగింపుపై భారతీయ సంస్థల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సంస్థలకు గూగుల్‌తో విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
శాశ్వత పరిష్కారంపై కేంద్ర మంత్రి ధీమా : అయితే ఈ వివాదంపై తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రానున్న నెలల్లో స్టార్ట్ అప్ కమ్యూనిటీ మరియు గూగుల్ శాశ్వత పరిష్కారానికి రాగలవని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అయితే యాప్‌ల తొలగింపు అనంతరం మాత్రం గూగుల్ నిర్ణయాన్ని తాము అనుమతించమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఇన్ యాప్ చెల్లింపు రుసుం వివాదం నేపథ్యంలో : యాప్‌లో చెల్లింపు మార్గదర్శకాలను పాటించడం లేదనే కారణంగా భారత్ చెందిన సుమారు 100కు పైగా యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఈ వివాదంపై అప్పుడే స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్... ఈ రకమైన డీ లిస్టింగ్‌ను తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. భారతీయ స్టార్టప్‌లకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.
అయితే యాప్‌ల తొలగింపుపై భారతీయ సంస్థల నుంచి అనేక విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే గూగుల్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఆండ్రాయిడ్, ప్లేస్టోర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు మరియు ప్రమోట్ చేసేందుకు ఈ ఫీజులు సహాయపడతాయని గూగుల్ వెల్లడించింది. అనంతరం న్యాయపరంగా ముందుకెళ్లి ఈ యాప్‌లను తొలగించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








