మీకు Gmail ఖాతా ఉందా.. సెప్టెంబర్ 20వ తేదీలోగా ఇలా చేయకుంటే అకౌంట్ డిలీట్ అవుతుంది..!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెయిల్ సర్వీసుల్లో జీమెయిల్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1.5 బిలియన్‌ల మంది Gmail ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం స్మా్ర్ట్‌ఫోన్‌లు సహా ఇతర పరికరాల అవసరాలు మరియు విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు జీమెయిల్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం జీమెయిల్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యూజర్ల సౌకర్యం, భద్రత కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది.
ఇటీవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న జీమెయిల్ ఖాతాలను తొలగించనున్నట్లు తెలిపింది. గూగుల్ సర్వర్‌లపై భారాన్ని తగ్గించేందుకు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

రెండు సంవత్సరాలుగా వినియోగంలో లేని జీమెయిల్ ఖాతాలు డిలీట్ కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి ఇన్‌యాక్టివ్ ఖాతాలు డిలీట్ కానున్నాయని పేర్కొంది. అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో జీమెయిల్ నుంచి మెయిల్ చేయడం లేదా జీమెయిల్ ఆధారంగా పనిచేస్తున్న ఇతర సర్వీసులను ఉపయోగించకపోయినా ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తామని గూగుల్ పేర్కొంది.
అయితే మీ ఖాతాలు డిలీట్ కాకుండా సెప్టెంబర్ 20 లోగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా స్కూల్, కాలేజీ, ఇతర విద్యాసంస్థల్లో అవసరాల కోసం క్రియేట్ చేసిన ఖాతాలు లేదా మీ వ్యక్తిగత ఖాతాలను వెంటనే యాక్టివ్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఏం చేయాలో కూడా గూగుల్ వెల్లడించింది. ఈ క్రింది విధంగా చేయడం ద్వారా మీ జీమెయిల్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.
మీ జీమెయిల్ ఖాతా డిలీట్ కాకుండా ఉండేందుకు సెప్టెంబర్ 20 వ తేదీలోగా వెంటనే లాగిన్ కావాలి. అనంతరం ఇతరులకు మెయిల్ పంపడం గానీ మీకు వచ్చిన మెయిల్స్‌ను చదవడం గానీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జీమెయిల్ ఖాతా యాక్టివ్‌లోకి వస్తుంది.
జీమెయిల్ అకౌంట్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు మీ గూగుల్ ఫోటోస్ నుంచి ఏదైనా ఫోటోను షేర్ చేయాలి. లేదా మీ జీమెయిల్ ఖాతాతో లింక్ చేసి ఉన్న యూట్యూ్బ్‌లో వీడియోలు వీక్షించడం ద్వారా కూడా మీ జీమెయిల్ అకౌంట్‌ను యాక్టివ్‌గా మార్చవచ్చు. ఫలితంగా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చు.
గూగుల్ డ్రైవ్ (Google Drive) లో ఏదైనా ఫొటో, వీడియో లేదా ఏదైనా డాక్యుమెంట్ ను అప్‌లోడ్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం ద్వారా జీమెయిల్‌ను యాక్టివ్‌గా మార్చవచ్చు. లేదా గూగుల్‌లో ఏదైనా అంశాన్ని శోధించడం (Google Search) ద్వారా కూడా జీమెయిల్ అకౌంట్ డిలీట్ కాకుండా చూడవచ్చు.
అయితే జీమెయిల్ ఐడీ లేదా ఫాస్‌వర్డ్ మర్చిపోయినా రికవరీ చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం జీమెయిల్ పేజీలోకి వెళ్లి Forgot Gmail ట్యాబ్ పైన క్లిక్ చేయండి. అనంతరం మీ ఐడీని రికవరీ చేయండి. తర్వాత మీ జీమెయిల్ ఖాతా ఫాస్‌వర్డ్‌ను కూడా క్రియేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








