గూగుల్ కంపెనీకి పాకిన మీటూ సెగ, ఉద్యోగులు వాకౌట్..

|

ఆధునికతకు నిలువుటద్దమైన గూగుల్‌ కార్యాలయాలు కూడా వివక్ష, వేధింపులకు అతీతం కాదని తెలుస్తోంది. గురువారం ఆసియావ్యాప్తంగా గూగుల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కాసేపు కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. లింగ వివక్ష, జాతి వివక్ష, ఉన్నతాధికారుల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర గూగుల్ కార్యాలయాల సిబ్బంది కూడా ఇదేవిధంగా నిరసన బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు సమాచారం.గూగుల్‌లో వైవిద్ధ్యాన్ని పెంచాలని, మహిళల పట్ల, మైనారిటీల పట్ల అనుసరిస్తున్న వైఖరి మెరుగుపడాలని, 'చెడుగా ఉండవద్దు' అనే కంపెనీ ఆశయాన్ని అమలు చేయాలని కొద్ది నెలలుగా ఉద్యోగులు పోరాడుతున్నారు.

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్, గూగుల్ కొత్త జీమెయిల్ ఫీచర్ లాంచ్ చేసింది

సామాజిక మాధ్యమాల ద్వారా...
 

సామాజిక మాధ్యమాల ద్వారా...

పిటిషన్లు సమర్పించడం, టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో మేధోమథన సమావేశాలు వంటివి జరుగుతున్నాయి.గురువారం ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ వాకౌట్ గురించి ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉపన్యాసాలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్‌కు...

గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్‌కు...

గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్‌కు బుధవారం రాత్రి ఆర్గనైజర్లు ఓ స్టేట్‌మెంట్‌ను పంపించారు. ఉద్యోగుల ప్రతినిథిని డైరెక్టర్ల బోర్డ్‌లో చేర్చాలని, పే ఈక్విటీ డేటాను అంతర్గతంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అల్ఫాబెట్‌కు చెందిన 94,000 మంది ఉద్యోగులు....

అల్ఫాబెట్‌కు చెందిన 94,000 మంది ఉద్యోగులు....

అల్ఫాబెట్‌కు చెందిన 94,000 మంది ఉద్యోగులు, వందలాది కాంట్రాక్టర్ల అసంతృప్తి కంపెనీ షేర్లపై ప్రభావం చూపకపోయినా తమ ఆందోళనను విస్మరిస్తే కంపెనీకి రిక్రూట్‌మెంట్‌, సిబ్బందిని నిలుపుకోవడంలో సమస్యలు ఎదురవుతాయని ఉద్యోగుల ప్రతినిధులు పేర్కొన్నారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు...

లైంగిక వేధింపుల ఆరోపణలు...

మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ ఉన్నతాధికారులకు గూగుల్‌ భారీ ప్యాకేజీలతో వీడ్కోలు పలికిందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ తీరుపై గూగుల్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు.

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్...
 

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్...

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ విడుదల చేసిన ప్రకటనలో ఉద్యోగులు నిర్మాణాత్మక ఆలోచనలను లేవనెత్తారని పేర్కొన్నారు. ఈ ఆలోచనలను చర్యల రూపంలోకి మార్చడానికి సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.

గూగుల్‌లోని ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి...

గూగుల్‌లోని ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి...

గతవారం గూగుల్‌లోని ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి మీద లైంగిక అనుచిత ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి. అవి "విశ్వసనీయమైన" ఆరోపణలేనని గూగుల్ సంస్థ కూడా భావించింది. కానీ, ఆ ఆరోపణలకు గురైన వ్యక్తికి సంస్థ నుంచి వెళ్ళిపోయిన తరువాత 9 కోట్ల డాలర్లు చెల్లించడం ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేసింది.

ఆరోపణలను ఎదుర్కొన్న ఆండీ రూబిన్...

ఆరోపణలను ఎదుర్కొన్న ఆండీ రూబిన్...

ఆ ఆరోపణలను ఎదుర్కొన్న ఆండీ రూబిన్ 'ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్' సృష్టికర్త. ఆయన ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని తోసిపుచ్చారు.అది అలా ఉండగానే మరో ఉద్యోగి - ఈసారి గూగుల్‌లోని ఎక్స్ రీసర్చ్ ల్యాబ్‌కు చెందిన వ్యక్తి కూడా రాజీనామా చేశారు. ఆయన పేరు రిచర్డ్ డివాల్.

ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న ఒక మహిళ పట్ల...

ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న ఒక మహిళ పట్ల...

తన విభాగంలో చేరడానికి ఇటీవలే ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న ఒక మహిళ పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. డివాల్ దీని మీద ఇంతవరకూ ఏమీ మాట్లాడలేదు. కానీ, రాజీనామా చేసిన తరువాత తన పట్ల తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారని మాత్రం అన్నారు.

లైంగిక వేధింపులకు పాల్పడినందుకు...

లైంగిక వేధింపులకు పాల్పడినందుకు...

లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కనీసం 48 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారని, వారికి ఎలాంటి చెల్లింపులూ జరపలేదని చెప్పిన పిచాయ్, 'న్యూయార్క్ టైమ్స్' రిపోర్ట్ ఇబ్బందికరంగా ఉందని అంగీకరించారు.

వాకౌట్లో పాల్గొన్న ఉద్యోగులు...

వాకౌట్లో పాల్గొన్న ఉద్యోగులు...

వాకౌట్లో పాల్గొన్న ఉద్యోగులు, 'నేను నా డెస్క్ దగ్గర కూర్చోవడం లేదు. లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన, పారదర్శకత లేమి వంటి సమస్యలకు వ్యతిరేకంగా వాకౌట్ చేస్తున్నాను' అని సహోద్యోగులకు చెబుతున్నారు.

ఉద్యోగుల చిట్టా ఇదే...

ఉద్యోగుల చిట్టా ఇదే...

జీతభత్యాలు, అవకాశాల కల్పనలో వివక్షకు ముగింపు పలకాలి. లైంగిక ఆరోపణల మీది నివేదికలను బహిరంగం చేయాలి. లైంగిక వేధింపుల ఆరోపణలను సురక్షితంగా, వ్యక్తిగత వివరాల గోప్యతతో చేయగలిగే అవకాశం.చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్‌ను నేరుగా సిఇఓకు రిపోర్ట్ చేసే స్థాయికి పెంచాలి.

నేరుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిపాలి...

నేరుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిపాలి...

ఆయన ప్రతిపాదనలను నేరుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిపాలి.బోర్డులో ఉద్యోగుల ప్రతినిధిని నియమించాలి. ఇప్పుడున్న ఫిర్యాదులపైనే కాకుండా భవిష్యత్తులోనూ బలవంతపు మధ్వవర్తిత్వానికి ముగింపు పలకాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google workers walk out to protest office harassment, inequality.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X