గూగుల్ ఆండ్రాయిడ్ రికార్డు స్దాయి డౌన్ లోడ్స్

Posted By: Prashanth

గూగుల్ ఆండ్రాయిడ్ రికార్డు స్దాయి డౌన్ లోడ్స్

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ డిసెంబర్ 6వ తారీఖున ఓ పెద్ద ఘనతను సాధించింది. ఏంటా గొప్పతనం అని అనుకుంటున్నారా.. గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ మార్కెట్ నుండి టెన్ బిలియన్ మొబైల్ అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డౌన్ లోడ్ చేసుకొవడం జరిగింది. గత ఆరునెలలుగా ఆండ్రాయిడ్ మార్కెట్లో అభివృద్ది రేటు అలా పెరుగుతూ చివరకి పది బిలియన్లకు చేరుకుంది.

ఈ సందర్బంలో గూగుల్ ప్రతినిధులు మాట్లాడుతూ నిజంగా మేము సాధించిన గోప్ప ఘనతలలో ఇదోకటిగా పేర్కోన్నారు. అంతక ముందు ఆరు నెలలో గనుక  అండ్రాయిడ్ మార్కెట్‌ని చూస్తే కేవలం 4 బిలియన్ల డౌన్ లోడ్స్  మాత్రమే ఉన్నాయని అన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ కొత్తగా ఆండ్రాయిడ్ మార్కెట్లోకి పాపులర్ అప్లికేషన్స్‌తో పాటు, గేమ్స్‌ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్‌కి అందుబాటులో ఉంచడం జరిగింది. సో.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మొబైల్ ఫోన్‌ని ఎవరైనా యూజర్స్ వాడుతుంటే 'గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్'లోకి వెళ్లి కొత్త అప్లికేషన్స్‌ని పరిశీలించవల్సిందిగా కొరుతున్నాం అని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot