స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్‌కు గూగుల్ అదిరిపోయే గిఫ్ట్.. మెషిన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు వచ్చేసింది..
Google machine learning: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ టెక్నాలజీ నేర్చుకోవాలనుకునేవాళ్ల కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది. "మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్స్ (MLCC)" అనే ఉచిత ఆన్‌లైన్ కోర్సును స్టార్ట్ చేసింది. ఈ కోర్సు డేటా సైన్స్, AI ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. డబ్బులు అడ్డంకి కాకుండా, ఎవరికైనా ML నేర్చుకునే అవకాశమివ్వాలని గూగుల్ ఈ కోర్సు తీసుకొచ్చింది. AI ఫీల్డ్‌లో రాణిద్దాం అనుకునేవాళ్లకి ఇదొక సువర్ణవకాశం.
* మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకోవాలి..
మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ఒక ప్రధాన భాగం. ఇది కంప్యూటర్లు ప్రోగ్రామింగ్ లేకుండానే డేటా నుంచి నేర్చుకునేలా చేస్తుంది. ML ఇప్పుడు చాలా రంగాల్లో వాడేస్తున్నారు. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ చెప్పడానికి, మెడికల్ డయాగ్నోసిస్‌లను ఇంప్రూవ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.

యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌లో మీకు నచ్చే వీడియోలు, సినిమాలు రికమెండ్ చేయడానికి.. ఇలా చాలా వాటిల్లో ML కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ ఫ్రీ కోర్సు తీసుకుంటే, ఈ ట్రెండింగ్ ఫీల్డ్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అయిపోవచ్చు, జాబ్ మార్కెట్‌లో ఈజీగా ఉద్యోగం సంపాదించొచ్చు. జాబ్ సెక్యూరిటీని పెంచుకోవచ్చు.
* ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు..
ఈ కోర్సులో ఎవరైనా జాయిన్ కావచ్చు. అయితే ఇది కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చదివే కాలేజ్ స్టూడెంట్స్‌కు బాగా సెట్ అవుతుంది. మెషిన్ లెర్నింగ్ నాలెడ్జ్‌ని పెంచుకోవాలనుకుంటున్న గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్ కూడా ఇందులో జాయిన్ కావచ్చు. AI అంటే ఇష్టం ఉన్నవాళ్లు, ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలనుకునే వాళ్లూ చేరొచ్చు.
* కోర్సులో ఏం నేర్చుకుంటారు..
గూగుల్ ML కోర్సులో స్టెప్ బై స్టెప్ అన్ని నేర్పిస్తారు. మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ అంటే సూపర్‌వైజ్డ్, అన్‌సూపర్‌వైజ్డ్, ఇంకా రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుంటారు. అంతేకాదు, డేటా ప్రీప్రాసెసింగ్ & ఫీచర్ ఇంజనీరింగ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. మోడల్ ట్రైనింగ్ కోసం డేటాని ఎలా రెడీ చేయాలో నేర్చుకోవచ్చు.
అల్గారిథమ్స్ & మోడల్ సెలక్షన్ విషయానికొస్తే డెసిషన్ ట్రీస్, న్యూరల్ నెట్‌వర్క్స్, డీప్ లెర్నింగ్ గురించి డీటైల్డ్‌గా చెబుతారు. రియల్-వరల్డ్ అప్లికేషన్స్ అయిన ఇమేజ్ రికగ్నిషన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆటోమేషన్ లాంటి వాటిల్లో ML ఎలా యూజ్ చేస్తారో చూస్తారు. మీరు చేసిన ప్రాజెక్ట్స్ మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చవచ్చు, మీ స్కిల్స్‌ని అందరికీ చూపించొచ్చు.
* గూగుల్ ML కోర్సు ఎందుకు చేరాలి
గూగుల్ AI రీసెర్చర్స్, ఇంజనీర్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ML టెక్నిక్స్ అన్నీ బోధిస్తారు. మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి గూగుల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా AI ఎక్స్‌పర్ట్స్, మీలాగే నేర్చుకునే వాళ్లు చాలా మందితో కనెక్ట్ అవ్వచ్చు.
* ఎలా జాయిన్ అవ్వాలి
ఇందులో జాయిన్ అవ్వడం చాలా సింపుల్. ముందుగా గూగుల్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి, కోర్సు కోసం రిజిస్టర్ చేసుకోవాలి, దాంతో మీ ML జర్నీ ప్రారంభమవుతుంది. గూగుల్ ఫ్రీ మెషిన్ లెర్నింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం.
స్టెప్ 1: అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్వాలి. గూగుల్ ML కోర్సు పేజ్ ఓపెన్ చేయాలి. సైన్ అప్ లేదా లాగిన్ కావాలి. గూగుల్ అకౌంట్‌తోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్‌రోల్ బటన్ క్లిక్ చేస్తే ఈ కోర్సులో జాయిన్ అయినట్లే. అప్పటినుంచి మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేయవచ్చు.
స్టెప్ 2: వీడియో లెక్చర్స్, అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్ వంటి కోర్సు మెటీరియల్స్ అన్ని ఉంటాయి. టైమ్‌కి తగ్గట్టు నేర్చుకోవాలి. మోడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫ్రీ కోర్సుతో మీ ML స్కిల్స్‌ని పెంచుకోవచ్చు. AI రంగం అభివృద్ధిలో మీరూ ఒక పార్ట్ అవ్వవచ్చు.


Click it and Unblock the Notifications