'అకీరా' జన్మదినాన్ని పురస్కరించుకోని డూడుల్

Posted By: Super

'అకీరా' జన్మదినాన్ని పురస్కరించుకోని డూడుల్

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ గొప్ప గొప్ప వ్యక్తులను స్మరించుకునే భాగంలో వారి జీవిత విశేషాలు, పుట్టినరోజు సందర్బంగా గూగుల్ హోం పేజి మీద గూగుల్ డూడుల్‌ని ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా గూగుల్ తనదైన శైలిలో ఓ సరిక్రొత్త గూగుల్ డూడుల్‌ని ప్రదర్శించింది. ఈరోజు గూగుల్ డూడుల్ జపాన్‌కు చెందిన 'అకీరా యోషిజావా' 101వ పుట్టినరోజుకి సంబంధించినది.

Read In English

జపాన్‌కు చెందిన 'అకీరా యోషిజావా' కాగితం మడత కళ 'ఆరిగామి'లో సుప్రసిద్దుడు. యోషిజావా లివింగ్ ఆర్ట్ నుండి ఆరిగామికి నిర్మించడంతో పాటు ఈ విభాగంలో సుమారు 50,000 మోడళ్లను రూపొందించాడు. ఒక రకంగా చెప్పాలంటే యోషిజావా ఫోల్డింగ్ టెక్నిక్స్‌కి కొత్త పునాది వేసిన ఆద్యుడు. తన చిన్నతనం నుండి కూడా కాగితం మడత కళ మీద ఉన్న ఆసక్తితో దీనిపై పట్టుని సాధించాడు.

అంతేకాకుండా ప్రపంచం మొత్తం మీద కొన్నిఈ కళను పెంపోందించేందుకు గాను కొన్న డజన్ల కొద్ది పుస్తకాలను 'కాగితం మడత కళ' మీద ప్రచురించాడు. న్యూమోనియా వ్యాధితో అకీరా యోషిజావా మార్చి 2005వ సంవత్సరంలో టోక్యో లో మరణించాడు. గూగుల్ హోం పేజి మీద ఉన్న ఈరోజు గూగుల్ డూడుల్‌ని రాబర్ట్ లాంగ్ రూపొందించాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot