యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ డెలివరీ...తల్లి బిడ్డ మృతి
యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ చాలా మంది చాలా నేర్చుకుంటారు.కానీ అన్ని విషయాలను అందులో చూసి నేర్చుకోలేం. కొన్ని ప్రయోగాలు బెడిసికొడతాయి.
యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ చాలా మంది చాలా నేర్చుకుంటారు.కానీ అన్ని విషయాలను అందులో చూసి నేర్చుకోలేం. కొన్ని ప్రయోగాలు బెడిసికొడతాయి.అందుకు ఈ విషాదమే ఉదాహరణ. ఇంట్లోనే ప్రసవం ఎలా చేసుకోవచ్చో యూట్యూబ్‌లో పదే పదే చూసింది ఓ అమ్మాయి .ఆ సూచనలు పాటిస్తూ ప్రసవానికి ప్రయత్నించింది. ప్రయోగం పాడై తనతో పాటు బిడ్డ ప్రాణాలు కొల్పోయింది. గోరఖ్‌పూర్ జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే...

పెళ్లి కాకనే గర్భవతి అవ్వడంతో
ఈ సంఘటన బిలండ్పూర్ ప్రాంతంలో, కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ వద్ద జరిగింది.స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), కంటోన్మెంట్, రవి రాయ్ ఈ సంఘటన గురించి పూర్తిగా వివరణ ఇచ్చాడు.పెళ్లి కాకనే గర్భవతి అవ్వడంతో లోకం తనను చాలా చీప్ గా చూస్తుందనే ఆ భయంతో సెల్ఫ్ డెలివరీ కి ప్రయత్నించిందని అతను తెలిపారు.

నాలుగు రోజులు క్రితం ఆ అమ్మాయి
నాలుగు రోజులు క్రితం ఆ అమ్మాయి రవి ఉపాధ్యాయ అనే భూస్వామి ఇంటిని అద్దెకు తీసుకుంది.తన అమ్మ రెండు రోజుల్లో ఇక్కడికి వస్తుందని తన డెలివరీ కు తన అమ్మ సహాయంగా ఉంటుందని అతనికి తెలిపింది.ఆద్దార్ కార్డు ద్వారా ఆమె వివరాలను వెరిఫై చేసిన తర్వాత రవి ఉపాధ్యాయ ఆమెకు గదిని అద్దెకు ఇచ్చాడు.

తల్లి బిడ్డ శవాలగు ఉండడం చూసి
అయితే సోమవారం ప్రొద్దున ఆమె ఇంటి గది నుంచి రక్తం రావడం గమనించిన రవి ఉపాధ్యాయ తలుపు పగలకొట్టి లోపలికి దూరాడు.అయితే అక్కడ తల్లి బిడ్డ శవాలగు ఉండడం చూసి షాక్ కి గురయ్యాడు. షాక్ కి నుంచి తేరుకోగానే పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు

యూట్యూబ్‌లో ఆ అమ్మాయి సొంతంగా డెలివరీ చేయడం ఎలాగో
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఆమె సెల్ ఫోన్ దొరికింది. యూట్యూబ్‌లో ఆ అమ్మాయి సొంతంగా డెలివరీ చేయడం ఎలాగో వీడియోలు చూసినట్టు పోలీసులు తెలిపారు. మహిళ యొక్క శరీరం దగ్గర కత్తెర, బ్లేడ్ మరియు థ్రెడ్ కనిపించిందని పోలీసులు తెలిపారు.వెంటనే ఆ బాడీ ను పోస్ట్ మార్టం కు తరిలించారు.

పోస్ట్ మార్టం తరువాత
పోస్ట్ మార్టం తరువాత ఆమె శరీరం కుటుంబ సభ్యులకు అప్పగించబడింది.విచిత్రం ఏంటంటే ఆ కుటం సంభ్యులు ఎవరి పైన కేస్ ఫైల్ చేయలేదు.


Click it and Unblock the Notifications








