పెద్ద బ్యాటరీలు.. సన్నని డిస్ ప్లే.. గొరిల్లా గ్లాస్ 2

Posted By: Prashanth

పెద్ద బ్యాటరీలు.. సన్నని డిస్ ప్లే.. గొరిల్లా గ్లాస్ 2

 

మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012 ఈవెంట్‌లో అందరి కళ్లు త్వరలో కొత్తగా విడుదల కానున్న గొరిల్లా గ్లాస్ 2 మీదనే. గొరిల్లా గ్లాస్ 2 ప్రభావ నిరోధకత మరియు స్క్రాచ్ నిరోధకతను కలిగి ఉండడమే ప్రధాన బలం. ఈ కొత్త డిస్ ప్లే భావన గతంలో ఉన్న డిస్ ప్లేతో పోల్చితే 20 సన్నగా ఉండే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీలు కోసం సన్నగా ఉండడమే కాకుండా అదనపు స్థలాన్ని కలిగి ఉంటాయి. ఈ డిస్ ప్లేతో తయారు చేసిన పరికరాలు స్క్రీన్ డ్యామేజిని కాపాడేందుకు పఠిష్టమైన రక్షణ వ్యవస్ద కలిగి ఉంటుంది.

మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012లో వెల్లడించిన సమాచారం ప్రకారం గొరిల్లా గ్లాస్ 2 డివైజ్‌లను ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో తయారు చేయనున్నారు. ఈ గొరిల్లా గ్లాస్ 2 రావడం వల్ల ముందు ఉన్న పరికరాలతో పోల్చి చూస్తే రాబోయే పరికరాలు సన్నగా ఉండనున్నాయి. రాబోయే కాలంలో ఈ గొరిల్లా గ్లాస్ 2 డిస్ ప్లేని వివిధ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఎలా ఉపయోగిస్తారో చూద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot