డెబిట్ కార్డ్ వాడితే రూ.కోటి గెలచుకునే ఛాన్స్!

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూ.340 కోట్ల విలువైన ఆఫర్లను అనౌన్స్ చేసింది. నగదురహిత లావాదేవీల వైపు దేశప్రజానీకాన్ని నడిపించి, తద్వారా క్యాష్‌లెస్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పే క్రమంలో రెండు సరికొత్త పధకాలను నీతి అయోగ్ ప్రకటించింది.

Read More : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..? ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిసెంబర్ 25 (క్రిస్మస్) నుంచి

లక్కీ గ్రాహక్ యోజన, డిజీ-ధన్ వ్యాపర్ యోజనా పేరుతో లాంచ్ అయిన ఈ పథకాలను డిసెంబర్ 25 (క్రిస్మస్) నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రోత్సాహకాలు..

వంద రోజుల పాటు  అందుబాటులో ఉండే ఈ స్కీమ్‌లో భాగంగా ఈ-వాలెట్స్, యూఎస్ఎస్‌డి ఇంకా స్మార్ట్‌ఫోన్ యాప్స్‌ను ఉపయోగించుకుని లావాదేవీలు నిర్వహించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. లక్కీ గ్రాహక్ యోజన పథకం ప్రజలందరికి వర్తిస్తుంది. డిజీ-ధన్ వ్యాపర్ యోజన పథకం వ్యాపారులకు మాత్రమే వరిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోజుకు 15,000 వేల మంది ఎంపిక..

లక్కీ గ్రాహక్ యోజనా పథకంలో భాగంగా రోజుకు 15,000 వేల మంది విజేతలను ఎంపిక చేస్తారు. వీరికి రూ.1000 చొప్పున ప్రోత్షాహాకాలు మంజూరు చేస్తారు. ఇదే పథకంలో భాగంగా వారానికి ఒకసారీ లక్కీ డ్రాలో భాగంగా 7,000 మంది విజేతలను ఎంపిక చేసి వారికి రూ.లక్ష వరకు నగదు బహుమతులను అందజేస్తారు.

డిజీ-థన్ వ్యాపర్ యోజన పథకంలో భాగంగా..

వ్యాపారుల కోసం తీసుకువచ్చిన డిజీ-థన్ వ్యాపర్ యోజన పథకంలో భాగంగా వారానికొకసారి 7,000 మంది విజేతలను ఎంపిక చేసిన వారికి రూ.50,000, రూ.5,000, రూ.2,500 ప్రోత్సాహాకాలను ఇవ్వటం జరుగుతుంది.

మెగా అవార్డ్స్ పేరుతో..

ఇవి కాకుండా మెగా అవార్డ్స్ పేరుతో భారీ నగదు బహుమతలను నీతి అయోగ్ ప్రకటించింది. ఈ అవార్డ్ స్కీమ్‌లో భాగంగా నవంబర్ 8 2016 నుంచి ఏప్రిల్ 13, 2017 వరకు నిర్వహించిన డిజిటల్ లావాదేవీలు ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

మొదటి విజేతకు రూ.కోటి బహుమతి

లక్కీ గ్రాహక్ యోజన పథకంలో భాగంగా మెగా అవార్డ్స్ క్రింద మొదటి విజేతకు రూ.కోటి, రెండవ విజేతకు రూ.50 లక్షలు, మూడవ విజేతకు రూ.25 లక్షల ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది.

మొదటి విజేతకు రూ.50 లక్షల నగదు బహుమతి

డిజీ-ధన్ వ్యాపర్ యోజన పథకంలో భాగంగా మెగా అవార్డ్స్ క్రింద మొదటి విజేతకు రూ.50 లక్షలు, రెండవ విజేతకు రూ.25 లక్షల, మూడవ విజేతకు రూ.5లక్షల ప్రోత్సాహాకాన్ని అందించటం జరుగుతుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Government Announces Awards upto Rs. 340 Crores on Digital Payments. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot