100 కు పైగా హానికరమైన గూగుల్ 'Chrome Extension'లు. జాగ్రత్త !

By Maheswara
|

భారత్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నెట్ భద్రతా విషయాలు చూసే సంస్థ అయిన CERT (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.ఇంటర్నెట్ వినియోగ దారులు గూగుల్ క్రోమ్ Extension లు ను ఇంస్టాల్ చేసుకునేటప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలని,100 పైగా హానికరమైన extension లను తాము గుర్తించినట్టు సూచించారు

CERT(Computer Emergency Response Team of India )

CERT(Computer Emergency Response Team of India )

ఈ కంపెనీ అందించిన వివరాల ప్రకారం 100 పైగా హానికరమైన ఈ ఎక్సటెన్షన్ లు మీకు సంబంధించిన మీ వ్యక్తిగత వివరాలు  మరియు మీ వ్యక్తిగత రహస్యాలను ఇతరులకు చేరవేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ extension ల లో ఉన్న ఒక రకమైన కోడ్ వల్ల వీటిని గూగుల్ సెక్యూరిటీ స్కాన్ చేసినప్పుడు కూడా అందులో ఉన్న పొరపాట్లను కనుక్కునే అవకాశాలు లేవని తెలిపారు.

హానికరమైన extension లు

హానికరమైన extension లు

ఈ హానికరమైన extension లు రహస్యం గా స్క్రీన్ షాట్ లు తీయగలవు ,clipboard ల లో మీరు ఏమి టైపు చేస్తున్నారు, ఏమి కాపీ చేసారు వంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు.అంతే కాక మీ కీబోర్డ్ కు సంబంధించిన విషయాలు ,మీ పాస్ వర్డ్  లు ఇంకా రహస్యమైన మీ వివరాలు సులభంగా సేకరించి ఇతరులకు చేరవేయ గలవు.
అందుకే ఇంటర్నెట్ భద్రతా నిపుణులు అందిస్తున్న సలహా మేరకు మీకు అత్యవసరమైన ఎక్సటెన్షన్ లు ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి.

Google Chrome వెబ్ స్టోర్
 

Google Chrome వెబ్ స్టోర్

ఇంస్టాల్ చేసుకునే ముందు కూడా గూగుల్ లో వాటి రివ్యూ లను ఒక సరి పరిశీలించి తరవాత నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.నిపుణుల అధ్యయనాల గణాంకాల ను పరిశీలిస్తే గత నెల రోజులలో 3 కోట్ల మంది వినియోగ దారులు ఈ హానికరమైన ఎక్సటెన్షన్ ల బారిన పడినట్లు సమాచారం.పరిశోధకులు అప్రమత్తమైన తర్వాత 70 కి పైగా హానికరమైన యాడ్-ఆన్‌లను తన అధికారిక Chrome వెబ్ స్టోర్ నుండి తొలగించినట్లు గూగుల్ తెలిపింది.

extention

extention

ఉచితం గా లభించే extention ల లో ఎక్కువ, వెబ్‌సైట్‌ల  గురించి వినియోగదారులను హెచ్చరించడానికి లేదా ఫైల్‌లను ఒక ఫార్మాట్ నుండి మరొక ఫార్మాట్‌కు మార్చడానికి . బదులుగా, వినియోగ దారునికి సంబంధించిన సమాచారాన్ని తీసుకోవడానికి అనే క ప్రశ్నలు మరియు అనుమతులు అడుగుతాయి.

ఈ ఏడాది జనవరిలో

ఈ ఏడాది జనవరిలో

ఈ ఏడాది జనవరిలో, వినియోగదారులను దోపిడీ చేసే లక్ష్యంతో మోసపూరిత లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో,హానికరమైన extention లు అన్నింటిని Google ,సస్పెండ్   చేసింది.అయినప్పటికీ కూడా గూగుల్ క్రోమ్అప్ స్టోర్ లో ఉన్న కొన్ని లొసుగుల ఆధారంగా డెవలపర్ లు సైలెంట్ గా తమ పని కానిచ్చేస్తున్నారు.అందుకే జాగ్రత్త.అవసరం ఉన్న Extention లు మాత్రమే వాడండి.

Best Mobiles in India

Read more about:
English summary
Government cyber security agency report says over 100 dangerous chrome extensions were removed 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X