ప్రధాని మోదీ పేరుతో ఉచిత ల్యాపీలు, నిజం తెలిప్తే షాకే

లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అందరికీ ఉచిత ల్యాప్స్‌టాప్స్ అందిస్తున్నారనే విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ న్యూస్ వాట్సప్ గ్రూపుల్ల

|

లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అందరికీ ఉచిత ల్యాప్స్‌టాప్స్ అందిస్తున్నారనే విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ న్యూస్ వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు అయితే సునామిలాగా దూసుకుపోయింది. ఈ న్యూస్ సారాశం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌ను ప్రకటించారు.

government-denies-offering-free-laptops-under-make-in-india

మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ఆవిష్కరించారు’ అని...ఈ విషయం వాట్సప్‌లలో మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్‌పై లింక్‌లు భారీగా షేరు అయ్యాయి.అయితే ఈ న్యూస్ నిజమా కాదా అనే విషయం తెలియకుండానే చాలామంది షేర్ల మీద షేర్లు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇందులో వాస్తవమెంత, అసలు ఈ న్యూస్ నిజమేనా అనేదానిపై ఓ లుక్కేద్దాం.ఫేక్ న్యూస్

వాట్సప్, సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే మెసేజ్‌లలో లింక్ కూడా ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మీరు మోసపూరిత వెబ్‌సైట్స్‌ ఓపెన్ అవుతుంది. వీటిల్లో మోదీ అఖండ విజయం సాధించినందుకు 2 కోట్ల మంది యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్స్ లభిస్తాయి అనే సమాచారం ఉంటుంది. పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు కూడా అడుగుతుంది. ఇది ఫేక్ న్యూస్. ఇందులో నిజం లేదు.

government-denies-offering-free-laptops-under-make-in-india

వెబ్ అడ్వర్టైజింగ్ ఆదాయం కోసం,
ప్రభుత్వం కూడా ఉచిత ల్యాప్‌టాప్ విషయాన్ని నమ్మవద్దని తెలియజేసింది. ఇకపోతే ఈ అంశంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కారణమైన రాజస్తాన్‌కు చెందిన నాగౌర్‌కు చెందిన రాకేశ్ జన్‌గిద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను 2019 బ్యాచ్‌కు చెందిన ఐఐటీ కాన్సూర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. వెబ్ అడ్వర్టైజింగ్ ఆదాయం కోసం తన అన్నతో కలిసి ఈ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

నకిలీ వెబ్‌సైట్,
మోదీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంగా ''ఉచిత ల్యాప్‌టాప్ పథకం'' అంటూ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత వివరాలు సేకరించి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మంది డేటాను సేకరించాడు. వెబ్‌సైట్‌లో యూజర్ల పేర్లు, వయస్సు, ఫోన్ నెంబర్, రాష్ట్రం లాంటి వివరాలను సేకరించినట్టు తేలింది.

ఐఐటీ పోస్టు గ్రాడ్యుయేషన్,
నిందితుడు రాకేశ్ జంగిద్ ఈ ఏడాది ఐఐటీ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా పుండ్లోటా అతడి స్వస్థలం. ప్రధాని మోదీ రెండోసారి ఎన్నికైన సందర్భంగా అతడు ఓ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు. లక్షలాది మందికి ఉచితంగా ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు అందించనుందంటూ వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్‌లలో ఊదరగొట్టాడు. ఈ ప్రకటనలో ప్రధాని మోదీ ఫోటోతో పాటు మేకిన్ ఇండియా లోగోను కూడా జోడించడంతో... పెద్ద ఎత్తున ప్రజలు ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వ్యవహారం కాస్తా ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సైపాడ్ ల్యాబ్స్ సాంకేతిక సాయంతో,
సైపాడ్ ల్యాబ్స్ సాంకేతిక సాయంతో నిందితుడు రాకేశ్‌ను గుర్తించి అరెస్టు చేశారు. వెబ్‌సైట్ ట్రాఫిక్ పెంచుకుని గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించేందుకే తాను ఈ వెబ్‌సైట్ తిరిచినట్టు రాకేశ్ విచారణలో అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ కంపెనీ ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని కాదని మరీ అతడు ఈ నిర్వాహానికి ఒడిగట్టడం గమనార్హం. కాగా ఈ వ్యవహారం ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్నదానిపైనా విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.ః

అనుమానించిన ఢిల్లీ పోలీసులు,
వాస్తవానికి ఈ మోసంపై పోలీసులకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదు రాలేదు. ఆన్‌లైన్ యాక్టివిటీని పోలీసులు పరిశీలిస్తుండగా ఫ్రీ ల్యాప్‌టాప్ క్యాంపైన్ గురించి తెలిసింది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని రోజులుగా ఆ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ బాగా వస్తున్నట్టు తేలింది. ఇదేదో మోసంలా ఉందని అనుమానించిన ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఐపీ అడ్రస్ ఆధారంగా రాజస్తాన్‌లోని నాగౌర్ ప్రాంతం నుంచి వెబ్‌సైట్ ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు.

Best Mobiles in India

English summary
Government denies offering free laptops under 'Make in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X