క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు అవసరం లేదు.. ఆధార్ ఉంటే చాలు!

నగదురహిత ఆర్థిక అభివృద్థికి కంకణం కట్టుకున్న కేంద్రం ప్రభుత్వం, నోట్లకు మాత్రమే కాదు క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డులకు సైతం చరమ గీతం పాడబోతోంది. కేవలం ఆధార్ కార్డ్ నెంబర్ ఆధారంగా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నిర్వహించకునే విధంగా సరికొత్త సాంకేతికతను ప్రభుత్వం అభివృద్థి చేసుకుంటున్నట్లు సమాచారం.

Read More : 5 నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్, మార్చి 2017 వరకు ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి..

కూల్‌ప్యాడ్ ఫోన్ కొంటే జియో సిమ్, మార్చి 31 వరకు ఫ్రీ కాల్స్, ఫ్రీ నెట్

ఈ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటలోకి వచ్చినట్లయితే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆధార్ నెంబర్‌ను ఫోన్‌లో ఎంటర్ చేసి ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్‌‌ ధృవీకరణగా ఇవ్వటం ద్వారా తమ ఖాతాలోని డబ్బును ఇతరుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుందట.

ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ తప్పనిసరి..

ఈ దిశగా అడుగులు వేస్తోన్న ప్రభుత్వం, ఇక పై దేశంలో తయారు కాబడే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదా ఐరిస్ స్కానర్ సపోర్ట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా కంపెనీలను కోరనునట్లు సమచారం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సరికొత్త ఒరవడికి నాంది పలికే అవకాశం..

డిలీట్ అయిన మెసెజ్‌లను తిరిగి పొందటం ఎలా..?

ఈ Authenticationతో కూడిన ఫోన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే నగదు బదిలీ ప్రక్రియ మరింత సులభతరంగా మారి ఆధార ఆధారిత లావాదేవీలు ఓ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశముంది.

ఎటువంటి పిన్ నెంబర్ అవసరం లేదు

ఆధార్ ఆధారిత లావాదేవీలకు ఎటువంటి కార్డ్ లేదా పిన్ నెంబర్ అవసరం లేదు. మీకు కేటాయించిన 12 అంకెల ఆధార్ నంబరును గుర్తుపెట్టుకుంటే చాలు.

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు మరింత సులువు..

2 రోజుల్లో 20 లక్షల డౌన్‌లోడ్స్

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారు తమ ఆధార్ నెంబర్‌తో పాటు వేలిముద్రలు ఆధారంగా చేసుకుని నగదు చెల్లింపు చేపట్టవచ్చు.

ఆధార్ లావాదేవీలు సురక్షితం..

క్రెడిట్, డేబిట్ లావాదేవీలతో పోలిస్తే ఆధార్ కార్డ్ లావాదేవీలు మరింత సురక్షితం. హ్యాక్ అవుతుంతున్న భయం ఉండదు. మీ వేలి ముద్ర లేదా ఐరిస్ ఎంటర్ చేస్తేనే లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

నీతి అయోగ్ కమిటీ..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాష్‌లెస్ లావాదేవీలను విజయవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీతి అయోగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఏడాది పాటు అధ్యయనం చేసి దేశంతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సులువైన మర్గాలను అన్వేషిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Government to facilitate Aadhaar based financial transactions through mobile phone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot