MNP rules పూర్తిగా మారిపోయాయి, ఓ సారి తెలుసుకోండి

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మొబైల్ యూజర్లకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు.

|

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మొబైల్ యూజర్లకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు. టెలికాం ఆపరేటర్ మారినా.. నంబర్ మారకుండా ఉండేదుకు దీని ద్వారా ఇతర నెట్ వర్క్ లకు వెళ్లేందుకు దీని ద్వారా అవకాశం కలుగుతుంది. దేశవ్యాప్తంగా పారదర్శకతతో పాటు సౌకర్యవంతమైన టెలికం ఇకో సిస్టంను నెలకొల్పటంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానం కీలక పాత్ర పోషిస్తోన్న నేపథ్యంలో దీనిపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ చర్యలు ప్రకటించింది.

13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించిన ఆదిత్యన్‌ రాజేశ్‌13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించిన ఆదిత్యన్‌ రాజేశ్‌

రెండు రోజులకు పరిమితం

రెండు రోజులకు పరిమితం

ఒకే సర్వీస్ ఏరియా పరిధిలో నంబరును పోర్ట్‌ చేసేందుకు గడువును రెండు రోజులకు పరిమితం చేసింది.

పోర్ట్‌ అవుట్ వ్యవధి

పోర్ట్‌ అవుట్ వ్యవధి

అలాగే, ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు పోర్ట్‌ అవుట్ వ్యవధిని నాలుగు రోజులుగా నిర్దేశించింది. యూజర్లకు అనుకూల విధానాల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాయ్ తెలిపింది.

రూ. 10,000 దాకా జరిమానా

రూ. 10,000 దాకా జరిమానా

కొత్త నిబంధనల ప్రకారం పోర్టింగ్ అభ్యర్ధనను తప్పుడు కారణాలతో తిరస్కరించిన పక్షంలో టెల్కోలు రూ. 10,000 దాకా జరిమానా చెల్లించుకోవాల్సి రానుంది. అలాగే కంపెనీలకు కస్టమర్ డేటాను అనుమతి లేకుండా షేర్ చేస్తే రూ.5 వలేల వరకు జరిమానా విధిస్తోంది.

పోర్టింగ్ కోడ్‌ వర్తింపు

పోర్టింగ్ కోడ్‌ వర్తింపు

ఇక, పోర్టింగ్‌కు కీలకమైన విశిష్ట పోర్టింగ్ కోడ్‌ వర్తింపు వ్యవధిని జమ్ము.. కాశ్మీర్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు మినహా అన్ని సర్కిళ్లలోను పదిహేను రోజుల నుంచ నాలుగు రోజులకు ట్రాయ్ కుదించింది. ఇక ఎస్‌ఎంఎస్‌ ద్వారా పోర్టింగ్ అభ్యర్ధనలను ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ట్రాయ్ వివరించింది.

 

 

నంబర్ల పరిమితి పెంపు

నంబర్ల పరిమితి పెంపు

కార్పొరేట్ పోర్టింగ్‌కు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క ఆథరైజేషన్ లెటర్‌పై 50 నంబర్లుగా ఉన్న పరిమితిని 100 నంబర్ల దాకా పెంచింది.

Best Mobiles in India

English summary
Government has changed MNP rules: 5 things to know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X