ఇంటర్నెట్ గూఢచర్యానికి నిఘా ‘నేత్ర’

Posted By:

మీరు పంపే ట్విట్టర్ సందేశాలు.. ఈ-మెయిల్స్.. స్టేటె్స్ అప్‌డేట్‌లు.. ఇంటర్నెట్ కాల్స్.. బ్లాగ్స్ ఇంకా ఫోరమ్స్‌లో దాడి (Attacck), బాంబు (Bomb), బ్లాస్ట్ (Blast) అనే పదాలను వాడినట్లయితే భద్రతా ఏజన్సీల నిఘా నీడలోకి మీరు వచ్చేస్తారు. ఎందుకంటే, దురుద్దేశపూరిత ఆన్‌లైన్ సేందేశాలను కనుగొనే క్రమంలో ‘నేత్ర' పేరుతో సరికొత్త ఇంటర్నెట్ గూఢచార వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతోంది.

ఇంటర్నెట్ గూఢచర్యానికి  నిఘా ‘నేత్ర’

స్కైప్, గూగుల్ టాక్ వంటి సాఫ్ట్‌వేర్‌ల ద్వారా ప్రసారమయ్యే ఎలాంటి అనుమానస్పద వాయిస్‌లనైనా కనుగొనేందుకు వీలుగా అన్ని భద్రతా ఏజన్సీల్లో ఏర్పాటు చేసిన ఈ నేత్ర
సాఫ్ట్‌వేర్‌కు హోం శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆధీనంలోని సెంటర్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అండ్ రోబోటిక్స్ ఈ నేత్ర ఇంటర్నెట్ గూఢచార వ్యవస్థను అభివృద్ధి చేసింది.

‘నేత్ర' పని చేయడం ప్రారంభించిన తరువాత కుట్రపూరిత వ్యూహాలను అమలు చేయడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్న అనుమానస్పద వ్యక్తులు, సంస్థల కార్యకలాపాల పై నిఘా పెట్టడానికి భద్రత ఏజన్నీలకు ఒక పెద్ద ఆయుధం దొరికినట్లవుతుందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot