5జీ దెబ్బ..ఇకపై పెరగనున్న ఇంటర్నెట్ వేగం

మీరు ఇంటర్నెట్ వేగం స్లోగా ఉందని బాధపడుతున్నారా.. ఫైళ్లు ఓపెన్ కాలేదని దిగులు చెందుతున్నారా..అయితే ఇకపై మీరు అటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు.

By Hazarath
|

మీరు ఇంటర్నెట్ వేగం స్లోగా ఉందని బాధపడుతున్నారా.. ఫైళ్లు ఓపెన్ కాలేదని దిగులు చెందుతున్నారా..అయితే ఇకపై మీరు అటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఇంటర్నెట్ స్పీడ్ నాలుగింతలు పెరగనుంది. ఇప్పటి దాకా కనీస ఇంటర్నెట్ వేగం 512 కేబీపీఎస్ ఉండగా.. దాన్ని 2 ఎంబీపీఎస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 మెగాబైట్లుగా ఉండనుందని టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు.

 

ఫోన్ల పేలుడుతో శాంసంగ్ కుదేల్, మళ్లీ ఇంకోటి..ఫోన్ల పేలుడుతో శాంసంగ్ కుదేల్, మళ్లీ ఇంకోటి..

ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..

ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..

ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోందని గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఆమె తెలిపారు.

5జీ తరం రానున్న నేపథ్యంలో ..

5జీ తరం రానున్న నేపథ్యంలో ..

3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు ఆమె అన్నారు.

డిజిటల్ ఎకానమీగా భారత ఆర్థిక వ్యవస్థ
 

డిజిటల్ ఎకానమీగా భారత ఆర్థిక వ్యవస్థ

భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని తెలిపారు. వైర్ లెన్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ పై కన్సల్టేషన్ పేపర్ ను ఇటీవల ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసిన అరుణ, అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించిన తరువాత తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.

మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నవారు..

మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నవారు..

ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నవారు వీడియోలను డౌన్‌లోడ్ చేసే సమయంలో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. 3జీ సబ్‌స్క్రైబర్లు తక్కువ డేటా స్పీడ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

4జీ రాకతో నెట్ స్పీడ్ పెరిగినా..

4జీ రాకతో నెట్ స్పీడ్ పెరిగినా..

4జీ రాకతో నెట్ స్పీడ్ పెరిగినా ఇది ఇంకా పెరగాల్సి ఉంది. 2జీ, 3జీ స్పెక్ట్రమ్ తక్కువ స్థాయిలో అందుబాటులో ఉండటం కూడా ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ డేటా స్పీడ్ పెరిగితే యూజర్లకు చాలా ఉపయోకరంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Government looks to hike minimum internet speed by nearly four times More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X