ట్విట్టర్ పై ప్రభుత్వం సీరియస్!

Posted By: Super

ట్విట్టర్ పై ప్రభుత్వం సీరియస్!

న్యూఢిల్లీ: దేశ భద్రత వంటి కీలక అంశాల్లో సహకరించడానికి నిరాకరిస్తున్న కొన్ని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లపై వేటుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసోం అల్లర్ల నేపథ్యంలో వెల్లువెత్తుతున్న ఎస్ఎమ్ఎస్, ఎమ్ఎమ్ఎస్ హెచ్చరిక సందేశాలను అదుపు చేయడంలో ట్విట్లర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల సాయాన్ని ప్రభుత్వం కోరింది.

దీనిపై సరిగ్గా స్పందించని 254 వెబ్‌సైట్లను ఇప్పటికే స్తంభింపజేసిన ప్రభుత్వం, ట్విటర్‌నూ ఆ జాబితాలో చేర్చేయోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు టెలికం శాఖకు కేంద్ర హోంశాఖ సూచించినట్టు సమాచారం. యూ ట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సైట్లు కేంద్రం వినతిపై సానుకూలంగా స్పందించగా, ట్విటర్ మాత్రం ముందుకు రాలేదు. ట్విటర్‌లో పోస్టు అయిన 28 పేజీల విషయంలో కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot