ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ సహా ఆపిల్ పరికరాల యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. వెంటనే ఏం చేయాలంటే?
ఆపిల్ సంస్థ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ మరియు వాచ్ యూజర్ల కు హెచ్చరిక మెసేజ్ ను పంపింది. అయితే భారత్ ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెన్పాన్స్ టీం (CERT-in) కూడా ఆపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు అప్రమత్తత సందేశాన్ని పంపింది. దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దీంతోపాటు ఆపిల్ ఉత్పత్తుల వినియోగదారులు తమ పరికరాలను అప్ డేట్ చేసుకోవాలని కోరింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్ మరియు ఆపిల్ టీవీ యూజర్ల కు సూచనలు చేసింది. ఈ పరికరాల్లో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ భద్రతా లోపాల కారణంగా ఆయా పరికరాలపై దాడులు చేసి, వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది.

ఏయే వెర్షన్‌లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే :
ఆపిల్ iOS వెర్షన్ 16.7.8 కంటే ముందున్న వెర్షన్ ఈ కారణంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరియు iPadOS 16.7.8 కంటే ముందు వెర్షన్, ఆపిల్ iOS మరియు iPadOS 17.5 కంటే ముందున్న, ఆపిల్ MacOS Monterey వెర్షన్ 12.7.5 కంటే ముందున్న వెర్షన్ లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
దీంతోపాటు ఆపిల్ MacOS Ventura 13.6.7 కంటే ముందున్న వెర్షన్, ఆపిల్ MacOS Sonoma 14.5 కంటే ముందున్న వెర్షన్, ఆపిల్ వాచ్ OS 10.5 కంటే ముందున్న వెర్షన్, సఫారీ 17.5 కంటే ముందున్న వెర్షన్, ఆపిల్ tvOS 17.5 కంటే ముందున్న వెర్షన్‌లు ఈ భద్రతా లోపాల కారణంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచన :
కొత్తగా అందుబాటులోకి వచ్చిన వెర్షన్ లు కూడా అటాక్ బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ వాచ్ డాగ్ గా వ్యవహరించే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెన్పాన్స్ టీం (CERT-in) తెలిపింది. అందువల్ల యూజర్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరియు వెంటనే తమ డివైజ్ లను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.
ఆపిల్ పరికరాల వినియోగదారులు తమ హ్యాండ్ సెట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి వీలైనంత వేగంగా అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఆపిల్ నుంచి తాజాగా అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్ వేర్ అప్‌డేట్ లతో ఈ తరహా సైబర్ దాడుల నుంచి రక్షణ పొందవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెన్పాన్స్ టీం (CERT-in) తెలిపింది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








