ఇండియాలో మరో 47 చైనా యాప్‌లపై నిషేదం!! PUBG ఇక లేనట్లే...

|

జాతీయ భద్రత మరియు డేటా గోప్యతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం గత నెలలో 59 చైనా యాప్లను నిషేధించింది. ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు దేశంలో మరో 47 చైనా యాప్‌లను నిషేధించింది. భారత ప్రభుత్వం కొత్తగా నిషేధించిన 47 చైనీస్ యాప్‌లు ఇంతకుముందు నిషేధించిన యాప్‌ల క్లోన్‌లుగా పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వం కొత్తగా నిషేదించిన 47 చైనా యాప్‌ల పూర్తి సమాచారం

ప్రభుత్వం కొత్తగా నిషేదించిన 47 చైనా యాప్‌ల పూర్తి సమాచారం

ప్రభుత్వం కొత్తగా నిషేధించిన 47 యాప్ల కొత్త జాబితా త్వరలో విడుదల కానుంది. కాకపోతే ఈ జాబితాలో ఎక్కువగా గతంలో నిషేధించబడిన యాప్‌ల ప్రత్యామ్నాయాలు లేదా లైట్ వెర్షన్లు అధికంగా ఉన్నట్లు సమాచారం. వీటిలో టిక్‌టాక్ లైట్, హెలో లైట్, షేర్‌ఇట్ లైట్, బిగో లైట్ మరియు VFY లైట్ వంటివి ఉన్నాయి. ఇప్పటికే ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో లేవు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకారం "ఈ సంస్కరణల మీద నిషేధం ఉన్నప్పటికీ యాప్‌లు పనిచేస్తున్నట్లు కనుగొనబడింది."

 

Also Read: Amazon Primeను ఉచితంగా అందిస్తున్న Vodafone,Airtel ప్లాన్‌లు ఇవే!!Also Read: Amazon Primeను ఉచితంగా అందిస్తున్న Vodafone,Airtel ప్లాన్‌లు ఇవే!!

ఇండియాలో చైనా కంపెనీలు నిషేధం

ఇండియాలో చైనా కంపెనీలు నిషేధం

వినియోగదారుల యొక్క గోప్యత మరియు జాతీయ భద్రతలను ఉల్లంఘించిన 250 కి పైగా యాప్‌ల జాబితాను భారత్ ఇప్పుడు తయారు చేసినట్లు ఒక నివేదిక సూచిస్తుంది. ప్రభుత్వ పరిధిలో జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే అలీబాబా, PUBG, టెన్సెంట్, షియోమి వంటి మరిన్ని చైనా కంపెనీలను దేశంలో నిషేధించే అవకాశాన్ని కూడా సూచిస్తుంది.

 

Also Read: ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ కొత్త వార్షిక ప్లాన్!!! డిస్నీ + హాట్‌స్టార్ VIP కంటే తక్కువ ధరకే..Also Read: ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ కొత్త వార్షిక ప్లాన్!!! డిస్నీ + హాట్‌స్టార్ VIP కంటే తక్కువ ధరకే..

గేమింగ్ యాప్‌ల నిషేధం

గేమింగ్ యాప్‌ల నిషేధం

చైనాకు చెందిన కొన్ని అగ్రగామి గేమింగ్ చైనీస్ యాప్‌లు కూడా భారత ప్రభుత్వం నిషేధం కొత్త జాబితాలో ఉన్నట్లు కొన్ని నిఘా వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం యొక్క స్కానర్ పరిధిలోకి వచ్చిన చైనా యాప్‌లలో అలీబాబా, PUBG, టెన్సెంట్, షియోమి మరియు బైట్ డాన్స్ ఉన్నాయి. ఈ చైనా యాప్‌లు అన్ని కూడా చైనా ఏజెన్సీలతో డేటాను పంచుకుంటున్నాయని ఆరోపించారు.

ఇండియాలో 59 చైనా యాప్‌ల నిషేధం

ఇండియాలో 59 చైనా యాప్‌ల నిషేధం

భారత సార్వభౌమత్వం, సమగ్రత మరియు భద్రతను దృష్టిలో పెట్టుకొని 59 చైనా యాప్‌లపై నిషేధం విధించినట్లు భారత ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. ఈ యాప్ లు భారత సార్వభౌమత్వానికి ముప్పుగా భావించబడ్డాయి. అంతేకాకుండా భారతదేశం మరియు చైనా యొక్క గాల్వన్ వ్యాలీ ఘర్షణ వెలుగులోకి వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్, బ్రౌజర్ మరియు కంటెంట్ యాప్ UC బ్రౌజర్, ఫైల్ షేరింగ్ సర్వీస్ షేరైట్, మహిళా-నిర్దిష్ట ఫ్యాషన్ షాపింగ్ యాప్ షెయిన్, ప్రముఖ మొబైల్ గేమ్ క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటివి మరిన్ని ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Government of India Banned 47 Chinese Apps Again: Here are The List

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X