హీరోయిన్ రష్మిక మందన్న వీడియోపై ప్రభుత్వం సీరియస్.. 3 సంవత్సరాల జైలు, లక్ష జరిమానా..!
సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నకిలీ వీడియో తనకే కాకుండా చాలా మందికి భయానికి గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన తాను కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించుకోలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు సహా ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. వీరందరికి హీరోయిన్ రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలకు కఠినమైన రిమైండర్‌ను జారీచేసింది. ఇందులో చట్టపరమైన నిబంధనలు సహా సంబంధిత జరిమానాలను ప్రస్తావించింది.

ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 66Dని అమలు చేసింది. కంప్యూటర్‌ను ఉపయోగించి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినందుకు శిక్ష. ఈ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.1 లక్ష వరకు జరిమానా విధించవచ్చని పేర్కొంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేస్ టెక్నాలజీ ద్వారా నటి రష్మిక మందాన (Actress Rasmika mandanna) వీడియోను రూపొందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు. ఈ వీడియో వెంటనే వైరల్ అయింది. ఈ వీడియో అభ్యంతరకరంగా ఉండడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రష్మిక స్పందించారు. వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు.

ఈ వీడియోలో ఉన్నది బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ అయితే. కొందరు డీప్ పేక్ టెక్నాలజీ ఆధారంగా మందన్న వీడియోను రూపొందించారు. అయితే ఈ వీడియో భాగా వైరల్ అయింది. దీనిపై అనేక మంది ప్రముఖులు నటి రష్మిక మందన్నకు మద్దతుగా నిలిచారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి, సోషల్ మీడియో సంస్థలు రిమైండర్‌ను జారీచేసింది.
డీప్‌ఫేక్ టెక్నాలజీ: ఈ ఘటనతో డీప్ ఫేక్ టెక్నాలజీ మరోసారి తెరపైకి వచ్చింది. డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌ను ఉపయోగించి నకిలీ కంటెంట్‌ను రూపొందించడం. అయితే ఈ వీడియోలు సదరు వ్యక్తులకు అత్యంత సామీప్యంగా ఉంటాయి. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా నకిలీ ఫోటో, వీడియో, ఆడియోలను రూపొందించవచ్చు.
డీప్ ఫేక్‌లు క్రియేట్ చేసేందుకు సోషల్ మీడియా సహా ఇతర ప్లాట్‌ఫాంల నుంచి వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తారు. ముఖ కవళికలు (Facial Expression), వాయిస్ సహా ఇతర నమూనాలను సేకరించి.. టెక్నాలజీ ఆధారంగా నకిలీ కంటెంట్‌ను రూపొందిస్తారు. నటి రష్మిక వీడియోను ఇలానే తయారు చేసినట్లు తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








