Home
News

ఆ కంటెంట్‌ను తొలగించండి.. సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక!

సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్‌ మీడియా సంస్థలయిన X (ట్విట్టర్‌), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు కీలక హెచ్చరికలు జారీచేసింది. తమ ప్లాట్‌ఫాంల నుంచి చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ (CSAM)ను తొలగించాలని స్పష్టం చేసింది.

తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో ఈ తరహా కంటెంట్‌ ఉంటే తక్షణ శాశ్వత తొలగింపు చర్యలు తీసుకోవాలని సూచించింది. భవిష్యత్‌లో ఇటువంటి కంటెంట్‌ను నియంత్రించేందుకు కంటెంట్‌ మోడరేషన్‌ అల్గారిథమ్‌, రిపోర్టింగ్‌ మెకానిజ్‌లను వినియోగించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఐటీ నిబంధనల ప్రకారం సురక్షితమైన, విశ్వసనీయమైన ఇంటర్నెట్‌ను రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Government of India warns X YouTube and Telegram

X, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫాంలలో చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటిరియల్‌ లేదని నిర్దారించుకోవడానికే వారికి నోటీసులు పంపించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఐటీ చట్టంలోని నిబంధనలు సోషల్‌ మీడియా మధ్యవర్తులపై కఠినమైన అంచనాలను ఉంచుతాయని, ప్లాట్‌ఫాంలో క్రిమినల్‌ లేదా హానికరమైన పోస్టులను అనుమతించకూడదని మంత్రి హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో ఉన్న కంటెంట్‌పై చర్యలు తీసుకోకుంటే ఐటీ చ‌ట్టంలోని సెక్షన్‌ 79 వర్తించదని ఫలితంగా చట్టం ప్రకారం పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ఈ సూచనలు పాటించకపోతే ఐటీ చట్టం 2021లోని రూల్‌ 3(1)(B) మరియు 4(4)ని ఉల్లింఘిస్తే నోటీసుల్లో పేర్కొన్న విధంగా మంత్రిత్వ శాఖ డిమాండ్‌లను పాటించడంలో వైఫల్యంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు.

Government of India warns X YouTube and Telegram

ఐటీ చట్టం, 2000 చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ (CSAM) సహా అశ్లీల కంటెంట్‌ను పరిష్కరించేందుకు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఐటీ చట్టంలోని 66E, 67, 67A, 67B సెక్షన్‌ల ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ అందించినందుకు కఠినమైన శిక్షలు, జరిమానాలు విధిస్తాయి.

సోషల్‌ మీడియా మధ్యవర్తులు తమ ప్లాట్‌ఫ్లాంలో చట్టవిరుద్దమైన హానికరమైన కంటెంట్‌ హోస్ట్‌ చేసేందుకు నిషేధించే IT చట్టం ద్వారా ఏర్పాటు చేసిన కఠినమైన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని మంత్రి చంద్రశేఖర్‌ హెచ్చరించారు. మంత్రిత్వ శాఖ ఆదేశాలపై వెంటనే చర్యలు తీసుకోకుంటే ఐటీ చట్టంలోని 79 ద్వారా అందించబడిన రక్షణను కోల్పోవచ్చని, ఫలితంగా పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

మంత్రిత్వ శాఖ లేవనెత్తిన అంశాలైన చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌తక్షణమే చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా సంస్థలకు స్పష్టం చేసింది. లేకుంటే ప్రస్తుతం సోషల్‌ మీడియా సంస్థ పొందుతున్న ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 కల్పిస్తున్న సేఫ్ హార్బర్‌ హోదాను ఉపసంహరించుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Union Government of india warns X youtube and Telegram to remove Child sexual abuse material
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X