Home
News

కీలక పరిణామం.. ఎలాన్‌మస్క్‌ సంస్థ స్టార్‌లింక్‌తో కీలక ఒప్పందం..!

Satellite Internet Services in india : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ (స్టార్‌లింక్‌) ద్వారా త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కీలకమైన అనేక అనుమతులను కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్‌లింక్ సంస్థ పొందింది. అయితే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది.

ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రంగా :
మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్‌లింక్‌ (Starlink) సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (LOI) పై సంతకం చేసింది. భారత్‌లో స్టార్‌లింక్ సంస్థతో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇందులో భాగంగా సంస్థలు, ప్రాంతాలకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

maharashtra Government parter with starlink

ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ :
ముఖ్యంగా మహారాష్ట్రలోని నందూర్బార్‌, గచ్చిరౌలి. ధరశివ్‌, వషిమ్‌ వంటి మారుమూల ప్రాంతాలు సహా వెనుక బడిన జిల్లాల్లోని ప్రభుత్వ సంస్థలు సహా ఇతర అవసరాలకు కోసం ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి X ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రకటన చేశారు.

'ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ICT రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. మరియు ప్రపంచంలోనే అత్యధిక ఉపగ్రహాలు కలిగిన సంస్థగా ఉంది. ఈ సంస్థను భారత్‌లోకి స్వాగతించడం సహా మహారాష్ట్రలో భాగస్వా్మ్యం కుదుర్చుకోవడం గౌరవంగా ఉంది.' అని ఫడణవీస్‌ తమ ప్రకటనతో తెలిపారు.

డిజిటల్‌ మహారాష్ట్ర మిషన్‌ :
స్టార్‌లింక్‌ మహారాష్ట్ర భాగస్వామ్యం.. డిజిటల్‌ మహారాష్ట్ర మిషన్‌ను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటు EV, తీరప్రాంత అభివృద్ధి, విపత్తు నిర్వహణలో సమన్వయం చేస్తుందని తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం 2025 చివరలో లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

స్టార్‌లింక్‌.. భారత్‌లో తమ సిబ్బందిని నియమించుకోవడం ప్రారంభించింది. బెంగళూరు కార్యాలయంలో ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన లింక్డిన్ లో కనిపించింది. అయితే ఎప్పటి నుంచి స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ సేవలు భారత్‌ లో ప్రారంభం కానున్నాయో తెలియాల్సి ఉంది.

* భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను ప్రారంభించేందుకు వీలుగా కీలకమైన అనుమతులను ఇప్పటికే స్టార్‌లింక్‌ పొందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందిస్తోంది. భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో (LEO) సుమారు 7000 పైగా ఉపగ్రహాలను స్టార్‌లింక్‌ కలిగి ఉంది.

అయితే స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. స్థానికంగానే ఎర్త్‌ స్టేషన్‌ గేట్‌వేను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. భారతీయ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ యూజర్ల డేటాను విదేశాలకు రూటింగ్, డిక్రిప్ట్‌, కాపీ చేయకూడదని షరతులు విధించినట్లు తెలిసింది.

భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులకు సంబంధించి కేవలం 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే అందించగలదని గతంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. దేశంలో గరిష్ఠంగా 200 Mbps వేగంతో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను అందిస్తుందని చెప్పారు.

Best Mobiles in India

English summary
Government of maharashtra signed letter of intent with starlink for satellite internet services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X