ఇండియా మరో 54 చైనీస్ యాప్‌లను నిషేధించనున్నది!! యూజర్ల భద్రత & గోప్యతే ప్రధాన కారణం
ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ మరియు స్మార్ట్ టీవీల వినియోగం అధికంగా ఉంది. స్మార్ట్ పరికరాలను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు తమ యొక్క పరికరాలలో యాప్‌లను డౌన్ లోడ్ చేయడానికి అధికంగా మొగ్గుచూపుతూ ఉంటారు. వీటిలో కొన్ని యాప్‌లు వినియోగదారులకు ఉపయోగకరమైనవిగా ఉంటే మరికొన్ని యూజర్ల యొక్క సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి వార్తలను ఇప్పటికే చాలానే విన్నారు. భద్రతాపరమైన ముప్పును చూపుతూ భారతప్రభుత్వం మరో 54 చైనీస్ యాప్‌లను త్వరలోనే నిషేధించనున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతప్రభుత్వం నిషేదించనున్న 54 చైనీస్ యాప్‌ల యొక్క పూర్తి సమాచారం విషయానికి వస్తే అధికంగా బ్యూటీ కెమెరా యాప్‌లు ఉన్నాయి. స్వీట్ సెల్ఫీ హెచ్ డి, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, ఈక్వాలైజర్ & బాస్ బూస్టర్, సెల్ఫ్ ఫోర్స్ క్యామ్ కార్డ్, ఐసోలాండ్ 2- యాసస్ అఫ్ టైం ల్యాండ్, వివా వీడియో ఎడిటర్, టెనెంట్ ఎక్సరివర్, ఓమియోజి అరీనా, అప్యోజి చెస్, డ్యూయల్ స్పేస్ లైట్ వంటివి మరిన్ని ఉన్నాయి. దేశ సార్వభౌమాధికారం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది జూన్ లో విస్తృతంగా ఉపయోగించే టిక్ టాక్, వీచాట్, హెల్లొ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలతో సహా మరో 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్ లను కూడా నిషేదించింది.

గత ఏడాది జూన్ నెలలో భారతదేశం మరియు చైనా యొక్క సరిహద్దు లడఖ్ గందరగోళం యొక్క హింసాత్మక ఘర్షణ సమయంలో లడఖ్‌లోని భారత భూభాగంపై PLA సార్వభౌమాధికారాన్ని ప్రకటించడం. అప్పుడు ఇరుదేశాల మధ్య పరస్పర వాగ్వాదాల తరువాత ఇరు దేశాల సైన్యాల మధ్య ఘోరమైన పోరాటం జరగడంతో ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. అలాగే చైనా యొక్క సైనికులు కూడా సుమారు 100 మంది మరణించిన తరువాత చైనా యొక్క మెజారిటీ యాప్ లు యూజర్ల యొక్క డేటాను సేకరిస్తున్న కారణంగా వాటిని నిషేధించడంతో పాటుగా నిఘా వర్గాలు రెడ్ ఫ్లాగ్ చేసాయి. అయితే చైనీస్ యాప్‌లపై నిషేధాన్ని కొనసాగించాలనే భారత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ వివక్షత లేని సూత్రాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది.

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు గతంలో తొలగించిన చైనీస్ యాప్ ల వివరాలు
భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు గతంలో తొలగించిన చైనీస్ యాప్ లలో టిక్‌టాక్, వాల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, వీచాట్, షేర్‌ఇట్, UC న్యూస్, UCబ్రౌజర్, బ్యూటీప్లస్, జెండర్, క్లబ్‌ఫ్యాక్టరీ, హెలో యాప్, లైక్, క్వాయ్, రోమ్‌వే, షీన్, న్యూస్‌డాగ్, ఫోటో వండర్, APUS బ్రౌజర్, VivaVideo-QU వీడియో ఇంక్, పర్ఫెక్ట్ కార్ప్, CM బ్రౌజర్ మరియు వైరస్ క్లీనర్ (హాయ్ సెక్యూరిటీ ల్యాబ్) వంటివి ఉన్నాయి. చైనా యొక్క యాప్ లు కొన్ని పెద్ద మొత్తంలో ప్రజల యొక్క ప్రైవేట్ డేటాను సేకరిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలపడంతో తొలగించారు.

భారత సైబర్ క్రైమ్
హానికరమైన యాప్ లను నిరోధించడానికి భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమగ్ర సిఫార్సును పంపింది. డేటా యొక్క భద్రత మరియు గోప్యతకు సంబందించిన ప్రమాదం గురించి పౌరుల నుండి ఆందోళనలను మంత్రిత్వ శాఖ అందుకుంది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డేటా భద్రత మరియు పబ్లిక్ ఆర్డర్ సమస్యలపై ప్రభావం చూపే గోప్యతా ఉల్లంఘన గురించి పౌరుల నుండి అనేక ప్రాతినిధ్యాలను పొందింది. అదేవిధంగా భారత పార్లమెంటులో కూడా వివిధ ప్రజా ప్రతినిధులు వీటి మీద ఆందోళనలు కూడా చేసారు. భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి మరియు పౌరుల గోప్యతకు హాని కలిగించే యాప్ లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలలో బలమైన కోరస్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications