దేశ వ్యాప్తంగా ఒకే వైఫై పాస్‌వర్డ్, కేంద్రం కసరత్తు

By Gizbot Bureau
|

బహిరంగ వైఫై వాడే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బహిరంగ ప్రాంతాల్లో వైఫైకు కనెక్ట్ అయ్యేందుకు వ్యక్తిగత వివరాలను ఒకసారి నమోదు చేసుకుంటే.. ఎప్పుడైనా.. ఎక్కడైనా బహిరంగ వైఫై వాడుకోవచ్చు. ఇందుకోసం పబ్లిక్‌ వైఫై interoperabilityకి అనుమతించాలని భావిస్తోంది. 'పబ్లిక్‌ వైఫై interoperability అంశం పరిశీలనలో ఉంది.

Government plans public WiFi interoperability

దీన్ని అమల్లోకి తెస్తే దేశవ్యాప్తంగా పబ్లిక్‌ వైఫై శ్రేణి సమీపంలోకి వస్తే చాలు ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ కావొచ్చు’ అని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతీసారి మొబైల్ ఫోన్ లో సమాచారం మొత్తం పొందు పరచాల్సిన అవసరం ఉండదు. ఈ సౌకర్యాన్ని సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని టెలికాం సంస్థలు, ఉచిత వైఫై అందించే సంస్థలతో ప్రస్తుతం చర్యలు జరుగుతుంది. ఈ శీర్షికలో భాగంగా ఫ్రీ వైఫై వాడేవారికి కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

నార్టన్‌ సర్వే హెచ్చరిక

నార్టన్‌ సర్వే హెచ్చరిక

పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని ఇతరుల చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్‌ సర్వే హెచ్చరిస్తోంది. అప్ డేటెడ్ OS వాడుతుండడం ఉత్తమం.దీంతో డివైజ్ ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. అలాగే యాంటీవైరస్ టూల్స్ వాడండి. నగదు లావాదేవీలు,పాస్ వర్డ్ ఎంటర్ చేసే పనులు చేయకండి. లేటెస్ట్ మొబైల్స్ లో టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఉంటుంది.దాన్ని ఆన్ చేసుకోండి. పని పూర్తైతే వెంటనే వైఫై ఆఫ్ చేయండి. VPNద్వారా ఉచిత వైఫై వాడుకోవడం ఉత్తమం.

డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం

డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం

పబ్లిక్ వై-ఫైను వినియోగించటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లకు మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసినపుడు కొన్ని జాగ్రత్తలను పాటించటం ద్వారా సేఫ్ జోన్‌లో ఉండొచ్చు.పబ్లిక్ వై-ఫైతో కనెక్ట్ అయి ఉన్నపుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి లావాదేవీలను నిర్వహించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు హోమ్ లేదా వర్క్‌ప్లేస్ నెట్‌వర్క్ చాలా సురక్షితం.

 ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు
 

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు

మార్గమధ్యంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినయోగించుకోవల్సి వస్తే పబ్లిక్ వై-ఫైకు బదులుగా మొబైల్ డేటాను ఉపయోగించుకోండి.మీరు వినియోగించే స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏ చిన్న సెక్యూరిటీ లోపమున్నా మీ డివైస్ హ్యాకర్లకు అందుబాటులో ఉన్నట్లే. మీ విండోస్ పీసీలో ఫైర్‌వాల్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ఉంచాలి.

 యాంటీ వైరస్ యాప్‌..

యాంటీ వైరస్ యాప్‌..

మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్‌ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాలి. తరచూ లేటెస్ట్ ఓఎస్ అప్‌డేట్‌లను పొందటం ద్వారా కూడా సెక్యూరిటీ సమస్యల నుంచి బయటపడవచ్చు.కొన్ని పబ్లిక్ వై-ఫైల వద్ద పాస్‌వర్డ్ చాల సులభతరంగా ఉండటం కారణంగా మీ డేటాను హ్యాకర్లు సులువుగా దొంగిలించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి, అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే పబ్లిక్ వై-ఫైను ఎంపిక చేసుకోండి.

 సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకండి

సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకండి

పబ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఈ చర్య మీ వ్యక్తిగత డేటాకే ప్రమాదం కావొచ్చు. కొన్ని పబ్లిక్ వై-ఫై కేంద్రాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ముసుగులో మాల్వేర్లతో కూడిన ప్రోగ్రామ్‌లను, మీ డివైస్‌‌లోకి జొప్పించి మీ డేటాను దొంగిలించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకండి.

Best Mobiles in India

English summary
Government plans public WiFi interoperability

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X