కేబుల్ టీవీ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్, ప్రభుత్వం సరికొత్త వ్యూహం ఇదే
దేశంలో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకుంటోంది.
దేశంలో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ministry of information and broadcasting, Telecom Regulatory Authority of Indiaలు సంయుక్తంగా దేశంలో ఇంటర్నెట్ వ్యవస్థని మారుమూల ప్రాంతాలకు ఎలా తీసుకువెళ్లాలి అనేదాని మీద ఇప్పటికే చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో భాగంగా కేబుల్ టీవీ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే విధంగా కసరత్తు చేస్తున్నాయి. మినిస్ట్రీ అధికారిక సమాచారం ప్రకారం దేశంలోని 19 కోట్ల హౌస్ హోల్డర్స్ కు టెలివిజన్ సెట్లు ఉన్నాయని వాటికి ఇంటర్నెట్ అనుసంధానం చేసే విధంగా వ్యూహాలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరిలో దాదాపు 10 కోట్ల మందికి కేబుల్ టీవీ సబ్ స్క్రిప్సన్స్ ఉన్నాయి.

ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచాలి
దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని మరింతగా పెంచుతామని ట్రాయ్ ఛైర్మెన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. దేశంలో ఇప్పటికే ఉన్న 7 శాతం నెట్ వర్క్ లకు తోడు మరింతగా నెట్ వర్క్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా గ్లోబల్ గా ఇది 46 శాతంగా ఉంది.

కొత్త సెటప్ బాక్సులను
కేబుల్ టీవీ సర్వీసుల ద్వారానే ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా అందిస్తే పని చాలా తేలికవుతుందని తెలుస్తోంది. ఇందుకోసం కొత్త సెటప్ బాక్సులను అందివ్వనున్నారు. ministry's engineering arm- BECIL ద్వారా ఈ బృహత్తర ప్రణాళిక పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

మరికొంత అదనం
కాగా కేబుల్ ఆపరేటర్లు ఇప్పుడు పే చేస్తున్న దానికి మరికొంత అదనంగా టెలికాం డిపార్ట్ మెంట్ కి పే చేస్తే సరిపోతుంది.ఈ మొత్తం కూడా కేవలం బ్రాడ్ బ్యాండ్ సర్వీసులకు మాత్రమే ఉంటుంది.ఓవరాల్ గా రెవిన్యూగా చూుకుంటే రెండు వ్యాపారాలతో వారికి మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సమావేశంలోనే ట్రాయ్ ఛైర్మెన్ శర్మ
గతేడాది డిసెంబర్ మధ్యలో జరిగిన సమావేశంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలోనే ట్రాయ్ ఛైర్మెన్ శర్మ అనేక విషయాలను ప్రస్తావించారు. కేబుల్ టీవీ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు ఎటువంటి టెక్నాలజీ అవసరం లేదని ఉన్న టెక్నాలజీతోనే ఇది సాధ్యపడుతుందని ఆయన తేల్చి చెప్పారు.

భిన్నాభిప్రాయాలు
అయితే ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేబుల్ టీవి ద్వారా ఇంటర్నెట్ అందించే వ్యూహానికి ట్యాక్స్ లాంటి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. అయితే దనిపై మరింతగా చర్చలు జరగాలని వారు కోరుతున్నారు


Click it and Unblock the Notifications








