డీప్‌ఫేక్ వీడియోలపై సోషల్‌మీడియా సంస్థలకు కేంద్రం కీలకసూచనలు.. ఆ కంటెంట్ గురించి యూజర్లకు చెప్పాలని స్పష్టం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీపై (Deepfake) ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు యధేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రముఖ నటుల డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ టెక్నాలజీపై పెద్ద ఎత్తువ ఆందోళన వ్యక్తం అయింది.
అప్పట్లో ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా సంస్థలకు స్పష్టమైన నోట్‌ను పంపించింది. అయితే తాజాగా అటువంటి నిబంధనలతో కూడిన సలహాలు ప్రభుత్వం మరోసారి జారీచేసింది. అన్ని సంస్థలు ఐటీ నిబంధనలను వినియోగదారులకు తెలియజేయాలని సూచించింది. మరియు నిషేధిత కంటెంట్ గురించి యూజర్లకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఐటీ మంత్రిత్వ శాఖ రానున్న రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిశితంగా గమనిస్తుందని.. అవసరం అయితే చట్టాలకు సవరణలు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపింది. చట్టాల ఉల్లంఘనలను గురించినా లేదా ఇతరుల ద్వారా నివేదించిన.. చట్టం ప్రకారం పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్షష్టం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని మరింత కఠినం చేసింది. ప్రముఖ నటులును లక్ష్యంగా చేసుకొని ఇటీవల డీప్‌ఫేక్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఫలితంగా ప్రజల్లోనూ ఆగ్రహం, ఆందోళన వ్యక్తం అయింది.

వాట్సాప్, ఫేస్‌బుక్, X ( ట్విట్టర్ ) వంటి సంస్థలు ఐటీ నిబంధనల ప్రకారం.. నిషేధిత కంటెంట్ గురించి వినియోగదారులకు స్పష‌్టంగా, కచ్చితంగా తెలియ జేయాలని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక సూచనను జారీచేసింది.
అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మరియు సాధారణ రిమైండర్‌లుగా, లాగిన్ సమయాల్లోనూ దీంతోపాటు ఫ్లాట్‌ఫాంలోకి సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తున్నప్పుడు నిబంధనల గురించి స్పష్టం తెలియ జేయాలని ఆదేశించింది. ఐపీసీ, ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షార్హమైన నిబంధనల గురించి వినియోగదారులకు తెలియజేయాలని సూచించింది.
ఐటీ చట్టం 3(1)(b) నియమాలు, నిబంధనలు గోప్యతా సహా ఇతర ఒప్పందాలను వినియోగదారుడికి అర్థం అయ్యే భాషలో తెలియజేయాలని సూచించింది. గత నెలలోనూ ప్రభుత్వం ఇలాంటి సూచనలను చేసింది. వినియోగదారులు ఫిర్యాదులు స్వీకరించిన 24 గంటల్లో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. సరైన స్పందన లేకుంటే రూల్ 7ను అమలుచేస్తామని హెచ్చరించారు.
నటి రష్మిక సహా ఇతర కొంతమంది నటుల డీప్‌ఫేక్ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీనిపై నటులు సహా ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలిచారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనలపై కఠినంగా స్పందించింది. సోషల్ మీడియా సంస్థలు ఇటువంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
డీప్‌ఫేక్ టెక్నాలజీ: డీప్‌ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌లను ఉపయోగించి నకిలీ కంటెంట్‌ను రూపొందించడం. అయితే ఈ వీడియోలు సదరు వ్యక్తులకు అత్యంత సామీప్యంగా ఉంటాయి. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా నకిలీ ఫోటో, వీడియో, ఆడియోలను రూపొందించవచ్చు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








