ఆధార్ లింక్‌తో మొబైల్ సిమ్ యాక్టివేషన్ నిమిషాల్లోనే

Posted By:

ఆధార్ నెంబర్ ఉంటే చాలు... నిమిషాల వ్యవధిలోనే కొత్త మొబైల్ సిమ్ యాక్టివేషన్ పూర్తవుతుంది. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ కొత్త విధానానికి సంబంధించి టెలికం శాఖ, యూనిక్ ఐడెంటిఫికేన్ ఆధారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రూపొందించిన ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ సర్వీస్ (ఇ-కేవైసీ) సేవను ప్రయోగాత్మకంగా పరిక్షించనుంది. ఇ-కేవైసీ సర్వీస్ ద్వారా ఆధార్ నెంబర్ కలిగిన వినియోగదారుడికి సంబంధించి అన్ని రకాల లావాదేవీలను బ్యాంకులు అలానే టలికం కంపెనీలు తనిఖీ చేసేందుకు వీలవుతుంది.

ఆధార్ లింక్‌తో మొబైల్ సిమ్ యాక్టివేషన్ నిమిషాల్లోనే

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

5 టెలికమ్ కంపెనీల భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ (లక్నో), రిలయన్స్ (భోపాల్), ఐడియా (ఢిల్లీ), వొడాఫోన్ (కోల్‌కతా), బీఎస్ఎన్ఎల్ (బెంగళూరు) నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు డాట్ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. జనవరి నుంచి ఈ ప్రాజెక్ట్ ఆరంభయ్యే అవకాశముంది.

ప్రస్తుతం కొత్త సిమ్‌కార్డ్ యాక్టివేషన్ చేసేందుకు కస్టమర్ నుంచి సంబంధింత ధృవీకరణ పత్రాలను తీసుకుని వాటిని తనిఖీ చేసి యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కనీసం రెండు రోజల సమయం పడుతోంది. తాజా ప్రాజెక్టులో బాగంగా మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసినట్లయితే ఇ-కేవీసీ సర్వీస్ ద్వారా ఆ కస్టమర్‌కు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి నిమిషాల వ్యవధిలోనే సిమ్‌ కార్డ్ను యాక్టివేషన్‌ చేసేందుకు వీలుంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Government to test UIDAI's e-KYC for mobile SIM. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting