కాల్ డ్రాప్ సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్

గత కొద్ది సంవత్సరాలుగా మొబైల్ యూజర్లను వేధిస్తోన్న కాల్ డ్రాప్ సమస్యలకు త్వరలో ఓ పరిష్కారం లభించబోతోంది. కాల్ డ్రాప్స్ పై తీవ్రంగా దృష్టి సారించిన ప్రభుత్వం త్వరలో ఓ ప్రత్యేకమైన టోట్ ప్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

కాల్ డ్రాప్ సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్

మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ పరిధిలో కాల్‌డ్రాప్ సమస్యల పై ఫిర్యాదు చేసేందుకు 1955 టోట్‌ప్రీ నెంబర్‌ను టెలికమ్ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టబోతోంది. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్ ఈ నెంబర్‌కు కేటాయించబడిన ఐవీఆర్ఎస్ సిస్టంను మెయింటేన్ చేస్తుంది. 1955 టోట్ ప్రీ నెంబర్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా దేశంలోని అన్ని టెలికం ఆపరేటర్లు నడుచుకోవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ

టెలికాం ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల మేరకు పసలేని కారణాలు చూపించి మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనను తిరస్కరించిన సర్వీస్ ప్రొవైడర్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అపరాధ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించి ఫిర్యాదు చేయాల్సి వస్తే ఈ నిబంధనలను ఆచరించండి.

టోల్ ఫ్రీ కస్టమర్ సర్వీస్..

ముందుగా మీ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించి టోల్ ఫ్రీ కస్టమర్ సర్వీస్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోండి. వెంటనే సంబంధిత టెల్కో నుంచి ఫిర్యాదు నెంబర్, తేది, సమయంతో తదితర అంశాలతో కూడిన మెసేజ్ అందుతుంది. ఆ సందేశాన్ని భద్రపరుచుకోండి. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆ ఫిర్యాదు నెంబర్‌ను రుజువుగా చూపించి తదుపరి చర్యకు సన్నద్ధంకండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పిలేట్ అధికారి

మీ ఫిర్యాదుకు సంబంధించి సదరు టెల్కో స్పందించనట్లయితే అప్పీలు అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశముంది. మీరు ఫిర్యాదు చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్ అప్పిలేట్ అధికారి పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌‌సైట్‌‌లో పేర్కొనబడతాయి. లేదా మీసిమ్ కార్డు ద్వారా పొందిన బుక్‌లెట్‌లో పొందుపరచబడతాయి.

బంధిత వెబ్‌‌సైట్‌‌లో

మీరు ఫిర్యాదు చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్ అప్పిలేట్ అధికారి పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌‌సైట్‌‌లో పేర్కొనబడతాయి. లేదా మీసిమ్ కార్డు ద్వారా పొందిన బుక్‌లెట్‌లో పొందుపరచబడతాయి. అక్కడ కూడా మీ సమస్య ఓ కొలిక్కిరానట్లయితే అప్పీలేట్ అధికారి ఇచ్చిన వివరాలను రుజువులుగా పేర్కొంటు టెలికాం శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు అందాల్సిన చిరునామా

మీ సమస్యను పరిష్కరించటంలో అప్పీలేట్ అధికారి విఫలమైనట్లయితే నేరుగా సంబంధిత రుజువులతో ‘భారతదేశ ప్రభుత్వ టెలికాం శాఖ'(డాట్ )కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందాల్సిన చిరునామా: పబ్లిక్ గ్రీవెన్సెస్ సెల్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్, రూమ్ నెం.518, సంచార్ భవన్, 20, ఆశోకా రోడ్, న్యూఢిల్లీ 110001

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Government to launch toll free number '1955' for call drops. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot