సోషల్ మీడియాలో ఈ గేమ్ వీడియోలు పోస్ట్ చేయకండి

By Gizbot Bureau
|

సోషల్ మీడియాలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వీడియోలు పోస్ట్ చేయవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన స్కల్ బ్రేకర్ వీడియోలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందులొ భాగంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు అయిన టిక్ టాక్. ఫేస్ బుక్, యూట్యూబ్ ఇతర వెబ్ సైట్లు ఈ గేమ్ కి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసేందుకు అంగీకరించవద్దని తెలిపింది. అలాగే ఇంతకు ముందు ఏవైనీ వీడియోలు ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయాలని తెలిపింది.

టిక్ టాక్ లో ఈ గేమ్ వైరల్
 

టిక్ టాక్ లో ఈ గేమ్ వైరల్

ఇప్పుడు ప్రమాదకర గేమ్ సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో ఈ గేమ్ వైరల్ అవుతోంది. అయితే ఈ గేమ్ తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది. స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ (Skull Breaker Challenge) పేరిట సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గేమ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడకండని నిపుణులు చెబుతున్నారు.

Skull Breaker Challenge

Skull Breaker Challenge

ఈ గేమ్ ఏంటంటే.. ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతుండగా, మూడో వ్యక్తి వారి మధ్యలో నిల్చుని అలాగే చేస్తుంటాడు. అయితే మధ్యలో వ్యక్తి పైకి ఎగురుతుండగా అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరూ తన్నడం ఈ గేమ్ ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి కింద పడేలా తన్నడం చూసిన చిన్నారులు, యువత ఈ ఛాలెంజ్‌ మత్తులో కూరుకుపోయారు. యాప్‌లో చూపిన విధంగా చిన్నారులు చేస్తుండటంతో వెన్నెముక, తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది దీని భారీన పడ్డారు.

గాయాలయ్యే ప్రమాదం

గాయాలయ్యే ప్రమాదం

చిన్నారులు, యువతలో ఈ ఛాలెంజ్‌కు ఆదరణ పెరిగితే వారికి గాయాలయ్యే ప్రమాదం ఉందని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీనేజ్‌ యువత ఎక్కువగా ఈ ట్రెండ్‌ను ఫాలోఅవడంతో ఇప్పటికే పలువురికి గాయలయ్యాయని ఎవరూ ఇలాంటి వాటి జోలికి పోరాదని సోషల్‌ మీడియా నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పిచ్చి గేమ్స్ వెంటనే బ్యాన్ చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Government wants Facebook, TikTok and YouTube to delete these videos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X