బడ్జెట్ 2014-15: డిజిటల్ ఇండియా లక్ష్యంతో గ్రామాల్లోకి ఇంటర్నెట్

Posted By:

కమ్యూనికేషన్ ప్రపచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను దేశనలుమూలలకు విస్తరింపజేసే లక్ష్యంతో ‘డిజిటల్ ఇండియా' కార్యక్రమం క్రింద కేంద్రం బడ్జెట్ 2014-15లో భాగంగా రూ.500 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగుపడనున్నాయి. అలానే, గ్రామీణ స్థాయిలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వినియోగాన్ని మరింతగా పెంచనున్నారు.

బడ్జెట్ 2014-15: డిజిటల్ ఇండియా లక్ష్యంతో గ్రామాల్లోకి ఇంటర్నెట్

ప్రభుత్వ సేవల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించటం, గ్రామాల్లో, పాఠశాల్లలో ఐటీ శిక్షణా విలువలను మెరుగుపరచటం అలానే గ్రామీణ స్థాయిలో భారతీయ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించటం వంటి అంశాలకు డిజిటల్ ఇండియా కార్యక్రమం ఉపకరించనుంది.

డిజిటల్ ఇండియా స్కీమ్ చిన్న, మధ్య తరహా సంస్థలకు చేయూతనివ్వడంతో పాటు తమ ఉత్పత్తులను చిల్లరగా, ఈకామర్స్ మార్గాల ద్వారా విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting