రూ.1000కే విండోస్ 10?
ప్రస్తుత మార్కెట్లో విండోస్ 10 హోమ్ వర్షన్ ధర రూ.8,000గానూ, ప్రొఫెషనల్ వర్షన్ ధర రూ.13,000గానూ ఉంది.
విండోస్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 పై ధర రాయితీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ను కోరింది. మాల్వేర్ అలానే ర్యాన్సమ్‌వేర్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో, భారత్‌లోని యూజర్లకు ఈ వన్‌టైమ్ డిస్కౌంట్‌ను కల్పించినట్లయితే పాత వర్షన్ నుంచి కొత్త వర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఎక్కుమ మంది మొగ్గుచూపుతారని కేంద్రం భావిస్తోంది.

ఇండియన్ యూజర్లు పాత ఓఎస్ నుంచి కొత్త ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుగా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై వన్‌టైమ్ స్పెషల్ డిస్కౌంట్‌ను ఇవ్వమని మైక్రోసాఫ్ట్‌ను కోరాం, ఇందుకు మైక్రోసాఫ్ట్ కూడా సానుకూలంగానే స్పందించిందని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సలహాదారు గుల్షన్ రాయ్ పీటీఐకు తెలిపారు.

డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి అనే దాని పై మైక్రోసాఫ్ట్ కసరత్తులు చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం రూ.1000 కన్నా తక్కువకే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో విండోస్ 10 హోమ్ వర్షన్ ధర రూ.8,000గానూ, ప్రొఫెషనల్ వర్షన్ ధర రూ.13,000గానూ ఉంది. ఇండియా వంటి ప్రధాన మార్కెట్లో లక్షల కొద్ది కంప్యూటర్లు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పైనే రన్ అవుతుండగా, వాటిలో కొన్ని మాత్రమే విండోస్ లేటెస్ట్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అయి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








