ఇంపోర్టెడ్ మొబైల్స్ పై 10% పన్ను భారం

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్స్ అలానే యాక్సెసరీస్ పై 10% బేసిక్ కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం విధించింది. దీంతో ఇంపోర్టెడ్ మొబైల్ ఫోన్‌లతో పాటు ఛార్జర్స్, హెడ్‌సెట్స్, బ్యాటరీ, యూఎస్బీ కేబుల్స్ అలానే ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై పన్నుభారం పడింది. దేశీయ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించే క్రమంలో ఇంపోర్టెడ్ మొబైల్స్ ఈ పన్ను భారాన్ని మోపినట్లు కేంద్ర తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పై 2 శాతం ప్రత్యేక ట్యాక్స్..

2017-18 యూనియన్ బడ్జెట్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి సంబంధించి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పై 2 శాతం ప్రత్యేక అదనపు సుంకాన్ని కేంద్రం విధించిన విషయం తెలిసిందే.

దేశీయంగా విడిభాగాల తయారీ ఊపందుకునే అవకాశం...

గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పై ఏ విధమైన ప్రత్యేకమైన అదనపు సుంకాలు లేవు. ప్రభుత్వ నిర్ణయంతో దేశీయంగా పీసీబీల తయారీ మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

ఫోన్‌ ఖరీదులో 40 నుంచి 50 శాతం వాటా పీసీబీలదే..

మొబైల్ ఫోన్ మొత్తం ఖరీదులో 40 నుంచి 50 శాతం వాటాను ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కలిగి ఉండటం విశేషం.

ప్రస్తుతానికి సామ్‌సంగ్ మాత్రమే..

భారత్‌లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను తయారు చేసుకుని తమ ఫోన్‌లలో వినియోగించుకుంటోంది. దేశంలో తయారయ్యే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పై ఎటువంటి పన్ను లేకపోవటంతో త్వరలోనే మరిన్ని కంపెనీలు దేశీయంగా పీసీబీలును తయారు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో ఫోన్ విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొబైల్ పరిశ్రమ స్వాగితిస్తోంది.

మొబైల్ బిల్లులూ మోత మోగనున్నాయి..

కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మొబైల్ బిల్లులు మోత మోగనున్నాయి. జీఎస్టీ అమల్లోకి రాకముందు టెలికం సర్వీసులకు సంబంధించిన ట్యాక్స్ రేటు 15శాతంగా ఉండగా. GST వల్ల 3 శాతానికి పెరిగి 18 శాతానికి చేరుకుంది. ఈ ప్రభావం పోస్ట్-పెయిడ్ అలానే ప్రీ-పెయిడ్ మొబైల్ యూజర్ల పై పడుతుంది.

పోస్ట్ పెయిడ్ బిల్లులు ఇలా..

గతంలో అమల్లో ఉన్న పన్ను విధానం ప్రకారం పోస్ట్‌పెయిడ్ వినియోగం నెలకు రూ.500గా ఉన్నట్లయితే ట్యాక్స్ మొత్తం కలుపుకుని రూ.575 చెల్లించాల్సి వచ్చరేసి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.15 ఎక్కువన్నమాట.

ప్రీ-పెయిడ్ యూజర్ల పైనా భారం..

ఇక ప్రీ-పెయిడ్ యూజర్ల విషయానికి వచ్చేసరికి, గతంలో అమల్లో ఉన్న పన్ను విధానం ప్రకారం రూ.100 పెట్టి ప్రీపెయిడ్ వోచర్‌ను కొనుగోలు చేసినట్లయితే రూ.85 టాక్‌టైమ్ లభించేది. రేజీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ.100 పెట్టి ప్రీపెయిడ్ వోచర్‌ను కొనుగోలు చేసినట్లయితే రూ.82 టాక్‌‌టైమ్ మాత్రమే లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Govt imposes 10% customs duty on imported mobile phones, parts. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot