దేశంలో 5జీ సేవలు కోసం చైనా కంపెనీకి ఆహ్వానం

దేశంలో 5జీ ప్రయోగాత్మక సేవలు ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించిందని చైనా టెలికాం దిగ్గజం హువాయి తెలిపింది.

|

దేశంలో 5జీ ప్రయోగాత్మక సేవలు ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించిందని చైనా టెలికాం దిగ్గజం హువాయి తెలిపింది. సెప్టెంబరు 27న టెలికాం విభాగం నుంచి ఆహ్వానం మేరకు, మా ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని హువాయి ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జేచెన్‌ వెల్లడించారు. 'ప్రయోగాత్మక సేవలను ఏయే జోన్లలో చేపట్టాలనే విషయం నిర్థారించేందుకు ఒక కమిటీని టెలికాం విభాగం నియమించింది.

 

రూ.15 వేలల్లో బెస్ట్ అనిపించే షియోమి స్మార్ట్‌ఫోన్లురూ.15 వేలల్లో బెస్ట్ అనిపించే షియోమి స్మార్ట్‌ఫోన్లు

ఇందులో భాగంగానే 100 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించనుంది. దిల్లీతో పాటు మరో నగరంపై మేము ఆసక్తి కనబరచాం అని చెన్‌ తెలిపారు. 'ఈ ఏడాది ఆరంభంలో ఎయిర్‌టెల్‌తో కలిసి ప్రయోగశాలలో చేసిన పరీక్షలో, 3.5 గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో, సెకనుకు 3 గిగాబైట్స్‌ కంటే అధికవేగంతో డేటా బదిలీని హువాయి సాధించింది. రాబోయే అయిదేళ్లలో భారత ఆర్థిక వృద్ధి శరవేగంగా ఉంటుంది. 5జీ సేవలతో టెలికాంతో అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు వస్తాయి' అని చెన్‌ పేర్కొన్నారు. 2020లో దేశీయంగా 5జీ సేవలు ఆరంభమయ్యే అవకాశం ఉంది.

ఇండియాలో 5జీ మీద వస్తున్నరూమర్లు ఇవే !

ఇండియాలో 5జీ మీద వస్తున్నరూమర్లు ఇవే !

2023 నాటికి మొత్తం ..
2017 ముగిసే నాటికి 4జీ ఎల్‌టీఈ చందాదారుల వాటా ఇండియాలో 20 శాతంగా ఉంది. భారత్‌లో యూజర్లు అత్యాధునిక టెక్నాలజీల వైపు ఆకర్షితులవుతున్నారని, 2023 నాటికి మొత్తం మొబైల్‌ చందాదారుల్లో 78 శాతం (78 కోట్ల కనెక్షన్లు) ఎల్‌టీఈవే ఉంటాయని ఈ నివేదిక పేర్కొంది.

4జీ కనెక్షన్లు 550 కోట్లు

4జీ కనెక్షన్లు 550 కోట్లు

2023 చివరి నాటికి అంతర్జాతీయంగా 4జీ కనెక్షన్లు 550 కోట్లుగా ఉంటాయని అంచనా వేసింది. ఇదే సమయంలో 5జీ చందాదారులు కోటికి చేరతారని ఎరిక్సన్‌ మొబిలిటీ అంచనా వేస్తోంది.

మొబైల్‌ చందాదారుల వృద్ధిలో..
 

మొబైల్‌ చందాదారుల వృద్ధిలో..

అంతర్జాతీయంగా సంఖ్యా పరంగా మొబైల్‌ చందాదారుల వృద్ధిలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 2018 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) నికరంగా 1.6 కోట్ల చందాదారులు పెరగడంతో మొత్తం చందాదారుల సంఖ్య 118 కోట్లకు చేరారు.

చైనా మొదటి స్థానంలో..

చైనా మొదటి స్థానంలో..

మొబైల్‌ చందాదారుల వృద్ధిలో చైనా మొదటి స్థానంలో ఉంది. జవనరి-మార్చి కాలంలో 5.3 కోట్ల కనెక్షన్లు పెరిగాయి. దీంతో చైనాలో మొబైల్‌ చందాదారుల సంఖ్య 147 కోట్లకు చేరింది.

2023 నాటికి 97 కోట్లకు..

2023 నాటికి 97 కోట్లకు..

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం 2023 నాటికి 97 కోట్లకు చేరుతుందని, 2017 చివరి నాటికి ఈ సంఖ్య 38 కోట్లేనని ఈ నివేదిక తెలియజేసింది. 5జీ స్మార్ట్‌ఫోన్లు 2019 తొలి అర్ధభాగంలో రావడం ప్రారంభమవుతుందని సెర్వాల్‌ పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ల వినియోగం వృద్ధితో..

స్మార్ట్‌ఫోన్ల వినియోగం వృద్ధితో..

ఇక స్మార్ట్‌ఫోన్ల వినియోగం వృద్ధితో భారత్‌లో నెలవారీ మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 2017చివరి నాటికి ఉన్న 1.9ఈబీ (ఎక్సాబైట్‌) నుంచి 10ఈబీ స్థాయికి పెరుగుతుందని అంచనా వేసింది.

Best Mobiles in India

English summary
China's Huawei gets DoT support to conduct 5G field trials with Indian telcos, state governments more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X