Home
News

విత్ డ్రా రూ. 10 లక్షలు దాటిందా, మీకు పన్ను పోటు తప్పదు

By Gizbot Bureau

ఆర్థిక రంగంలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏడాదికి రూ.10 లక్షల కన్నా ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే పన్ను విధించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని తగ్గించేందుకు, డిజిటల్ పేమెంట్లను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

విత్ డ్రా రూ. 10 లక్షలు దాటిందా, మీకు పన్ను పోటు తప్పదు

నల్లధనంపై ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగా బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఇక ఏడాదికి రూ.10 లక్షలు మించి నగదు ఉపసంహరణలు చేసినైట్లెతే పన్నులు వేయాలని యోచిస్తున్నది. తక్కువ మొత్తాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న భౌతిక లావాదేవీలు నల్లధనానికి ఆస్కారమిస్తుండటం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుండటంతోనే నగదు ఉపసంహరణలకు పరిమితి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తున్నది.

 వచ్చే నెల 5న..

వచ్చే నెల 5న..

వచ్చే నెల 5న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నది తెలిసిందే. దీంతో ఈ సందర్భంగా దీనిపై ఓ స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

 ఆధార్ తప్పనిసరి

ఆధార్ తప్పనిసరి

దీంతో పాటు అధిక మొత్తంలో జరిగే అన్ని నగదు ఉపసంహరణలకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదననూ కేంద్రం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. దీనివల్ల సదరు వ్యక్తుల గుర్తింపు సులభతరమవుతుందని, ట్యాక్స్ రిటర్నులనూ పోల్చుకోవచ్చని చెబుతున్నారు.
ఇప్పటికే రూ. 50,000లకుపైగా డిపాజిట్లకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను ఇవ్వాల్సి వస్తున్నది. ఇప్పుడు విత్‌డ్రాలకు ఆధార్ నెంబర్‌ను ఇచ్చేలా చేస్తున్నారు. కాగా, ఆధార్ సంఖ్య దుర్వినియోగం కాకుండా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)తో రక్షణ కల్పించే వీలుందని అధికారులు చెబుతున్నారు.

పేద, మధ్యతరగతి వర్గాలపై

పేద, మధ్యతరగతి వర్గాలపై

నిజానికి ఏటా రూ.10 లక్షలకుపైగా నగదు ఉపసంహరణలతో చాలా వరకు వ్యక్తులు, వ్యాపారులకు అవసరం ఉండదన్నది ప్రభుత్వ అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో ఆపై లావాదేవీలకు పన్నులు వేయడం సబబేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే పేద, మధ్యతరగతి వర్గాలపై ఎలాంటి పన్నుల భారం పడకుండా నిర్ణయాలుండాలన్నదే ప్రభుత్వ అభిమతమని వారు స్పష్టం చేస్తున్నారు.

 బీసీటీటీని మళ్లీ తీసుకొచ్చేందుకు

బీసీటీటీని మళ్లీ తీసుకొచ్చేందుకు

యూపీఏ ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టి 2009లో తీసేసిన బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(బీసీటీటీ)ని కూడా మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అన్నింటి కంటే కీలకమైనదంటంటే.. అత్యధికంగా ట్యాక్స్ కట్టే వ్యక్తులు ప్రధాని మోదీతో చాయ్ తాగే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నెఫ్ట్, ఆర్టీజీఎస్ బదిలీలపై చార్జీలను రద్దు

నెఫ్ట్, ఆర్టీజీఎస్ బదిలీలపై చార్జీలను రద్దు

కరెన్సీ వినియోగాన్ని తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ఇటీవల నెఫ్ట్, ఆర్టీజీఎస్ బదిలీలపై చార్జీలను రద్దు చేసింది. కేంద్రం సైతం డిజిటల్ లావాదేవీలపై ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నది. దీనిపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి ఇది దోహదపడనుంది. దీనికి తోడు ఇప్పుడు ఏడాదికి రూ.10 లక్షలకు పైగా డబ్బు విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ ప్లాన్‌తో డిజిటల్ ట్రాన్సాక్షన్‌కు మరింత ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

 ప్రశ్నిస్తున్న అధికారులు

ప్రశ్నిస్తున్న అధికారులు

అయినా డిజిటల్ చెల్లింపులుండగా.. ఎందుకు రూ.10 లక్షలకుపైగా నగదు ఉపసంహరణలు చేయాలని పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లబ్ధిదారులు కూలీ పొందాలంటే ఆధార్ అవసరం అవుతున్నది. కానీ రూ.5 లక్షలు ఉపసంహరించుకున్నవారికి మాత్రం ఆధార్ అక్కర్లేదు.

Best Mobiles in India

English summary
Govt may introduce tax on cash withdrawal of Rs 10 lakh in a year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X