చైనాతో పాటు విదేశీ ఫోన్లకు చుక్కలు, ఒకే ఒక్క దెబ్బ !

By Hazarath
|

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు విదేశీ మొబైల్ కంపెనీలు ఒక్కసారిగా కుదుపులకు లోనవతున్నాయి. ఇండియాలో ఉత్పత్తిరంగానికి భరోసానిస్తూ స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్ సెట్లు, మైక్రోవేవ్‌లు, ఎల్‌ఈడీ బల్బులు సహా మరికొన్ని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది. ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్‌ఫోన్లపై ఇప్పటివరకూ సున్నా శాతంగా ఉన్న సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో వీటి ధరలు మరింత పెరుగనున్నాయి.

 

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?కారణాలు ఇవేచైనా వస్తువులు ఎందుకంత చీప్..?కారణాలు ఇవే

విదేశీ మొబైల్ కంపెనీలకు షాక్ ..

విదేశీ మొబైల్ కంపెనీలకు షాక్ ..

ఇండియా మొబైల్ మార్కెట్ ని శాసించేది ఎక్కువగా విదేశీ మొబైల్ కంపెనీలు అన్నదే జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఈ విధానానికి కేంద్రప్రభుత్వం స్వస్తీ పలకబోతోంది. ఇప్పటిదాకా ఉన్న ట్యాక్స్‌ని 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దేశీయ వ్యాపారుల వర్తకంపై..

దేశీయ వ్యాపారుల వర్తకంపై..

అయితే ఈ నిర్ణయం దేశీయ వ్యాపారుల వర్తకంపై కూడా ప్రభావాన్ని చూపనుందని తెలుస్తోంది. దేశీయ టెలికం మార్కెట్‌లో తమ వాటాను పెంచుకునేందుకు విదేశాల నుంచి చౌక రకం స్మార్ట్‌ఫోన్లను దిగుమతి చేసుకుంటున్న ఆపరేటర్లపై ఈ నిర్ణయం తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆపిల్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బ
 

ఆపిల్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బ

కాగా ఈ ఈ నిర్ణయంతో అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బ తగులనుంది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో అమ్ముతున్న ఐఫోన్లలో 88 శాతం హ్యాండ్‌సెట్లను ఈ సంస్థ దిగుమతి చేసుకుంటోంది.

ఐఫోన్ల ధరలను మరింత పెంచడం గానీ..

ఐఫోన్ల ధరలను మరింత పెంచడం గానీ..

ప్రభుత్వ నిర్ణయంతో ఆపిల్ ఇకమీదట దేశంలో ఐఫోన్ల ధరలను మరింత పెంచడం గానీ లేక ఆ హ్యాండ్‌సెట్ల అసెంబ్లింగ్‌ను భారత్‌లోనే మొదలు పెట్టడం గానీ చేయాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

చైనా కంపెనీలపై కూడా ఈ నిర్ణయం..

చైనా కంపెనీలపై కూడా ఈ నిర్ణయం..

ఇక పొరుగుదేశం చైనా కంపెనీలపై కూడా ఈ నిర్ణయం భారీగానే ప్రభావం చూపనుంది. అక్కడ తయారైన మొబైళ్లను ఇండియాలో అత్యంత తక్కువ ధరకే అమ్ముతూ భారీగా లాభాలను గడిస్తున్నాయి. ఇప్పుడు దిగుమతి సుంకం పెరగడంతో ఆ కంపెనీలు కూడా ఫోన్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఎదురైంది.

టెలివిజన్ సెట్లపై ..

టెలివిజన్ సెట్లపై ..

స్మార్ట్‌ఫోన్లతో పాటు టెలివిజన్ సెట్లపై ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 20 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌ఈడీ దీపాలపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నామని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

ఇతర వస్తువులు

ఇతర వస్తువులు

మైక్రోవేవ్ ఒవెన్లు, సెట్‌టాప్ బాక్సులు, షాండ్లియర్లు, సెర్చ్‌లైట్లు సహా లైటింగ్ ఫిట్టింగ్‌లు, ల్యాంపులపై దిగుమతి సుంకాన్ని కూడా రెట్టింపు చేసి 20 శాతానికి, టీవీ కెమెరాల్లాంటి వీడియో రికార్డింగ్ పరికరాలతో పాటు విద్యుత్ మీటర్లపై ప్రస్తుతం 10 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మేకిన్ ఇండియాకి మరింత ఊపు

మేకిన్ ఇండియాకి మరింత ఊపు

కాగా దేశీయ వ్యాపారల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా మేకిన్ ఇండియా మరింత ఊపు అందుకునే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

10 బిలియన్ల దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో..

10 బిలియన్ల దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో..

10 బిలియన్ల దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దేశీయ కంపెనీల రెవెన్యూ వృద్ధి రోజు రొజుకు మందగిస్తున్న నేపథ్యంలో దేశీయ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దిగుమతి పన్నును పెంచింది.

ప్రభుత్వం నిర్ణయం ప్రోత్సాహమే

ప్రభుత్వం నిర్ణయం ప్రోత్సాహమే

ఏడాదికి 500 మిలియన్ల సెల్‌ఫోన్లు తయారీ చేసే దేశీయ తయారీ సంస్థలకు ప్రభుత్వం నిర్ణయం ప్రోత్సాహం అందించనుందని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మోహింద్రూ అన్నారు.

ఎలక్ట్రానిక్స్ విభాగం సక్సెస్ ..

ఎలక్ట్రానిక్స్ విభాగం సక్సెస్ ..

కాగా దేశీయ పరిశ్రమను మరింతగా విస్తరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఎలక్ట్రానిక్స్ విభాగం సక్సెస్ అయింది.

Best Mobiles in India

English summary
Govt raises import duty on electronic items including cellphones, TV to boost Make in India Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X