సర్కార్ కొత్త స్కీమ్..ఉచితంగా సెల్‌ఫోన్‌లు?

Posted By: Super

సర్కార్ కొత్త స్కీమ్..ఉచితంగా సెల్‌ఫోన్‌లు?

2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగువ, మధ్య తరగతి ప్రజలను మరింత ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగా ‘హర్ హాత్ మెయిన్ ఫోన్’(ప్రతి చేతిలో ఒక ఫోన్) అనే నినాదంతో కూడిన కొత్త పధకాన్ని మన్మోహన్ సర్కార్ ప్రారంభించనుంది. ఈ పధకంలో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 60 లక్షల కుటుంబాలకు ఉచితంగా మొబైల్ ఫోన్‌లను సమకూర్చనున్నారు. ఇందు కోసం రూ.7,000కోట్లను వెచ్చిస్తున్నట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ఈ స్కీమ్‌ను ప్రకటించనున్నారు. తాజా ప్రభుత్వం పధకం పై ప్రధాన ప్రతిపక్షం బాజపా(భారతీయ జనతా పార్టీ) తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఓటర్లను ప్రలోబాలకు గురిచేయటమే లక్ష్యంగా ఈ చర్యలకు ఒడిగడుతున్న కాంగ్రెస్ సర్కార్ అవినీతి నిర్మూలను ఎందుకు కంకణం కట్టుకోవటం లేదని పలువురు నేతలు ప్రశ్నించారు. గ్రామాలకు విద్యుత్‌ను సక్రమంగా అందించలేకపోతున్న సర్కార్, సెల్‌ఫోన్‌లివ్వటం ద్వారా ఏం మేరకు లబ్ధి పొందుతుందని ఆ పార్టీ నాయకుడు బాల్‌బీర్ పుంజ్ ఎద్దేవా చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot