Home
News

భూకంపాలను జీపీఎస్ ద్వారా ముందుగానే గుర్తించవచ్చు

టెక్నాలజీ డెవలప్ మెంట్ ఒక్కోసారి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కొట్టిపారేయలేం. టెక్నాలజీలో వచ్చిన పెను మార్పులు ద్వారా ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంతో ప్రాణనష్టాన్ని నియంత్రించుకోగలుగుతున్నాము. ఈ క్రమంలో ప్రకృతి విపత్తుల్లో ఒకటైన భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు GPS సిస్టమ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

భూకంపాలను జీపీఎస్ ద్వారా ముందుగానే గుర్తించవచ్చు

ఈ GPS సహాయంతో భారీ భూకంపాలను సైతం ముందుగానే గుర్తించవచ్చు. దీని కోసం 1990 నుంచి వచ్చిన 3 వేలకు పైగా భూకంపాలకు సంబంధించిన డేటాబేస్ ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఒరెగాన్‌ పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలించిన విశ్లేషించారు. జీపీఎస్‌ డేటా ఆధారంగా భూపొరల్లో భారీగా వచ్చిన పగుళ్లు, కదలికలతో భూ ప్రకంపనలు రావడాన్ని గుర్తించారు. భూకంపాలకు సంబంధించిన చిన్న చిన్న సంకేతాలను సైతం సిస్మోమీటర్‌ గుర్తించిన దానికంటే 10-15 సెకన్ల ముందుగానే జీపీఎస్‌ ద్వారా గమనించినట్లు పరిశోధకులు తెలిపారు. GPS ఆధారంతో భూకంపం ముందస్తు హెచ్చరికలను గుర్తించవచ్చని ఒరెగాన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డిగో మెల్గార్ తెలిపారు.

భూకంపాలు ఎలా వస్తాయి

భూకంపాలు ఎలా వస్తాయి

భూమి లోపలి పొరల్లో అనూహ్యమైన మార్పులతో శిలలు ఒకదానికి ఒకటి రాపిడికి గురవ్వడం, ఒత్తిడికి గురై ఆకస్మికంగా పగుళ్లు ఏర్పడటం, విరిగిపోవడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి కారణంగా భూఉపరితలంపై భూప్రకంపనాలకు దారి తీస్తుంది. రెండు రాతి శిలలు లేదా పొరలు రాపిడికి గురై వేగంగా కిందికి జారిపోవడం వల్ల భూఉపరితలంపై ఏర్పడే వ్యత్యాసం వల్ల పగుళ్లు, బీటలు బారుతాయి. భూకంపాలు సంభవించడానికి వాతావరణం కారణం కాదు. భూగర్భంలో ప్లేట్ షిఫ్ట్స్ వల్ల.. భూకంపాలు సంభవిస్తాయి.

భూఉపరితలంపై ప్రకంపనాలు

భూఉపరితలంపై ప్రకంపనాలు

భూ అంతరపొరల్లో ఊహించని మార్పులతో భూఉపరితలంపై ప్రకంపనాలు చోటు చేసుకుంటాయి. భూఉపరితం నుంచి సుమారు 800 వందల కిలోమీటర్ల లోతులో ఈ మార్పులు సంభవిస్తాయని పరిశోధకుల అంచనా. రాతి శిలలు, పొరల కదలికలు ఆగిపోయే వరకు ఉపరితలంపై ప్రకంపనల తీవ్రత కొనసాగుతుంది. దీనినే భూకంపం అంటారు. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై లెక్కిస్తారు. రిక్టర్ స్కేల్ అనేది ఓ పరికరం కాదు. భూకంప తీవ్రతను గణాంక సూత్రాలను ఆధారంగా చేసుకొని లెక్కిస్తారు.

అత్యంత పెద్ద భూకంపం

అత్యంత పెద్ద భూకంపం

సౌత్ చిలీలోని వాల్డీవియాలో 1960 మే 22 న ఈ భూకంపం సంభవించింది. ఇది అత్యంత పెద్ద భూకంపం. ఈ భూకంపం 9.5గా రిక్టర్ స్కేల్ పై నమోదు అయింది. ఈ భూకంపంలో.. 1500 మంది చనిపోయారు.
సింక్హోల్స్ కారణంగా భూకంపాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ.. అది వాస్తవం కాదు.ఆర్టిక్టిక్ వాతావరణ పరిస్థితులు అంటార్కిటికాలో ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఐస్ క్వేక్స్ సంభవిస్తూ ఉంటాయి.భూకంపాలు కేవలం సంభవిస్తాయి. వాటిని వినలేం. గట్టిగా ఉండే భూమిలోపలు ఈ భూకంపాలు వస్తాయి.

 అలాస్కాలో ఎక్కువ భూకంపాలు

అలాస్కాలో ఎక్కువ భూకంపాలు

1974 నుంచి 2003 మధ్యలో నెలకు వెయ్యికి పైగా భూకంపాలు అలాస్కాలో సంభవించేవి. క్యాలిఫోర్నియాలో కంటే.. అలాస్కాలో మూడురెట్లు ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి.8 లక్షల 30 వేల మంది చైనాలో భూకంపం వల్ల చనిపోయినట్లు అంచనావేస్తున్నారు. 1556లో రిక్టర్ స్కేల్ పై 8గా నమోదైంది.

భూకంపాలు ఎందుకు వస్తాయి ?

భూకంపాలు ఎందుకు వస్తాయి ?

ప్రపంచంలో 90 శాతం భూకంపాలు భూమిలో ఉండే టెక్టానిక్‌ ఫలకాల మధ్య కదలికల వల్ల సంభవిస్తాయి. ఈ ఫలకాలు నీటిపై తేలియాడే మంచు పలకల్లాగా ప్రతి సంవత్సరం అనేక సెంటీమీటర్ల దూరం కదులుతూ ఉంటాయి. టెక్టానిక్‌ ఫలకాలు అలా కదులుతున్నప్పుడు భూమిలో ఒకదాంతో మరొకటి పెన వేసుకొని ఉండే శిలలు రాపిడికి గురై వాటి మధ్య లంకె ఏర్పడుతుంది. ఈ సంఘటన వల్ల వూహించలేని పీడనం ఏర్పడి ఆ ఒత్తిడికి ఒకటిగా కలిసి ఉండే శిలలు తమ మధ్య బలాలను అధిగమించడంతో అవి కాస్తా పగిలిపోతాయి. దాంతో భూమి పొరల్లో తటాలున మార్పు వస్తుంది. ఈ మార్పు వల్ల భూమి వెంటనే కంపిస్తుంది.
ఈ కంపనం వల్ల ఉత్పన్నమయ్యే తరంగాలు అవి ఏర్పడిన ప్రదేశం నుంచి గంటకు 13000 కిలోమీటర్ల వేగంతో నలు దిక్కులా పయనిస్తూ భూకంప కేంద్రం నుంచి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలను వినాశనానికి గురి చేస్తాయి. భూమిలో ఉండే టెక్టానిక్‌ ఫలకాల కదలిక వల్లే కాకుండా అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల, భూమిలో ఉండే నూనె వాయువుల నిక్షేపాలను వెలికి తీయడం వల్ల ఏర్పడిన అతి పెద్ద సొరంగాలు కూలిపోవడం వల్ల ఏర్పడిన పీడనం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి.

Best Mobiles in India

English summary
GPS data can detect early signs of megaquakes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X