ఇంటికి దారి చూపించే బూట్లు!

Posted By: Staff

ఇంటికి దారి చూపించే బూట్లు!

 

ఇంటికి దారిచూపే కొత్త రకం బూట్‌లను బ్రిటన్‌కు చెందిన డిజైనర్ డొమినిక్ విల్‌కాక్స్ రూపొందించారు. జీపీఎస్ ఆధారితంగా స్పందించే ఈ బూట్లలలో ఇంటి చిరునామాను పొందిపరిస్తే చాలట. అవే క్షేమంగా ఇంటికి చేరుస్తాయని ఈ ఔత్సాహిక పరిశోధకుడు వాపోతున్నాడు. 1939లో వచ్చిన ‘ద విజార్డ్ ఆఫ్ ఓజెడ్’ స్ఫూర్తితో డొమినక్ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టునిట్లు డెయిలీ మెయిల్ పేర్కొంది.

ఎక్కడికి వెళ్లినా ఇంటికి దారిచూపించే జత బూట్లను రూపొందించలనుకున్నా. ద విజార్డ్ ఆఫ్ ఓజెడ్ సినిమాలో డోర్తి తన పాదరక్షలు నొక్కగానే ఇంటికి చేరడాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ ప్రయోగానికి కృషిచేసినట్లు విల్ కాక్స్ వెల్లడించారు.  బయటలకు వెళ్లే ముందు ఈ బూట్లలో ఇంటి చిరునామాను అప్‌లోడ్ చేస్తే చాలు.. తిరిగి ఇంటికి ఏలా వెళ్లాలో ఆ బూట్లే చెబుతాయి. జీపీఎస్ యాంటెనాను ఎడమ బూటులో బిగిస్తారు. దీంట్లో రింగ్ పరిణామంలో ఉండే ఎల్ఈడి పరికరం గైడ్‌లా వ్యవహరిస్తుంది.  వైర్‌లెస్ సహాయంతో కుడి, ఎడమ బూట్ల మధ్య కమ్యూనికేషన్ ఉంటుందని డొమినక్ వివరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot