Home
News

'న్యూ ఐప్యాడ్' రాకతో ఐప్యాడ్ 2 ధర రూ 5,000 తగ్గింపు

By Super
Grab iPad 2 in discount price


మీరు గనుక ఆపిల్ ఐప్యాడ్ ఉత్పత్తులను అమితంగా ప్రేమిస్తున్నారా.. అలాంటి ప్రేమికుల కోసం ఆపిల్ ఓ సరిక్రొత్త ఆఫర్‌ని విడుదల చేస్తుంది, మార్చి 7వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ వర్సన్ 'న్యూ ఐప్యాడ్' విడుదలైన సందర్బంగా ఆపిల్ ఐప్యాడ్ 2 ధరను రూ 5,000 వరకు తగ్గించనునట్లు సమాచారం. ఈ తగ్గింపు ధర విధానం ఆపిల్ కొత్త వర్సన్ 'న్యూ ఐప్యాడ్' మార్కెట్లోకి విడుదలవగానే అమలులోకి వస్తుంది. దీంతో ఇండియాలో ఆపిల్ ఐప్యాడ్ 2 ధర సుమారుగా రూ 24,500 ఉండనుంది.

బుధవారం శాన్‌ప్రాన్సికోలో జరిగిన మీడియో ఈవెంట్లో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆపిల్ మూడవ జనరేషన్ టాబ్లెట్ 'న్యూ ఐప్యాడ్'ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16 నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలలో ఇది లభ్యమవుతుంది. ఆపిల్ ఐప్యాడ్ 2 ధరలు తగ్గించినప్పటికీ.. సేల్స్ ఇంకా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.

ఇండియాలో 16జిబి మెమరీ కలిగిన ఐప్యాడ్ 2 ధర ప్రస్తుతం 29, 500 ఉండగా తగ్గింపు ధర ప్రకారం సుమారు రూ 24, 500కే లభించనుంది. ఈ ధర 16జిబి వై-ఫై మోడల్‌ది. అదే 16జిబి వై-ఫైతో పాటు 3జీ ఫీచర్ ఉన్న ఐప్యాడ్ 2 ధర సుమారు రూ 32, 900గా ఉండనుంది. 'న్యూ ఐప్యాడ్' విడుదల సందర్బంగా ఈ వివరాలన్నింటినీ కూడా ఆపిల్ తన ప్రెస్ రిలీజ్‌లో తెలిపింది.

ఐతే స్టీవ్ జాబ్స్ మరాణంతరం ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టిమ్ కుక్ చేతుల మీదగా విడుదల చేసిన ఆపిల్ 'న్యూ ఐప్యాడ్ ' ఇండియాలో ఎప్పుడవుతుందో తదితర వివరాలను వెల్లడించ లేదు.

ఆపిల్ 'న్యూ ఐప్యాడ్' వివరాలు సంక్షిప్తంగా:

శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు.

దీనితో కంటెంట్‌ను … ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X