యాపిల్ పై శ్రామిక సంఘాల కన్నెర్ర!

Posted By:

యాపిల్ పై శ్రామిక సంఘాల కన్నెర్ర!

యాపిల్ కంపెనీ పై చైనాలో మరోసారి లేబర్ హక్కుల సంఘాలు మరోమారు ఆందోళణలను ఉధృతం చేసాయి. యాపిల్ ఐఫోన్‌ల రూపకల్పనలో భాగంగా ప్రమాదకర రసాయనాల మిక్స్‌‍ను ఉపయోగిస్తున్నారని, పర్యావసానంగా కంపెనీలోని ఉద్యోగులు రోగాల భారిన పడే ప్రమాదముందని చైనా లేబర్ వాచ్, గ్రీన్ అమెరికా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. చైనా లేబర్ వాచ్ గత కొంత కాలంగా యాపిల్ కంపెనీ పై విమర్శలు చేస్తూనే ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఫోన్‌ల నిర్మాణంలో భాగంగా బెంజీన్, ఎన్-హెక్సేన్ వంటి ప్రమాదకర రసాయానల వినియోగాన్ని నిషేధించాలని ఈ రెండు సంఘాలు పట్టుబడుతున్నాయి. బెంజీన్ అనే రసాయనం రక్త క్యాన్సర్‌కు కారణమవుతుందని, ఎన్-హెక్సేన్ నాటి వ్యవస్థ పై ప్రమాదం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో యాపిల్ ఒక ప్రకటనలో స్పందిస్తూ తాము పీవీసీ ప్లాస్టిక్ సహా ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ns-kJ5Podjw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot