ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారా.. మీకో షాకింగ్ వార్త..!!
ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, క్యాసినోలు ఆడేవారికి GST కౌన్సిల్ షాకింగ్ వార్త చెప్పింది. వాటిపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా జరిగిన GST 50వ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, క్యాసినో పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేశారు.
ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, క్యాసినోలపై గరిష్ఠంగా GST విధించాలని చాలా రోజుల క్రితమే మంత్రుల బృందం జీఎస్‌టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేసింది. ఈ అంశంపై చాలా సార్లు చర్చ జరిగింది. అయితే ఆన్‌లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీనే కొనసాగించాలని సంబంధిత సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, క్యాసినోలను 28 శాతం శ్లాబ్‌లోనికి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్, కేసినోలు, గుర్రపు పందేలకు 28 శాతం జీఎస్టీ విధించడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలు కాకుండా నియంత్రించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంబంధిత పరిశ్రమలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
జీఎస్టీ విధింపు అనంతరం ఆన్‌లైన్ గేమ్‌పై వంద రూపాయలు ఖర్చు చేస్తే రూ. 28 చెల్లించాల్సి ఉంటుందని ఈ- గేమర్స్ అండ్ ప్లేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ శివాని వివరించారు. ఈ నిర్ణయం కారణంగా ఆన్‌లైన్ గేమింగ్ ఆడేవాళ్లను నిరుత్సాహపరుస్తుందని, కొందరి జీవన ఉపాధిని దెబ్బతీస్తుందని తెలిపారు.
మరికొంత మంది కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమకు కొత్త సవాళ్లను తీసుకొస్తుందని తెలిపారు. ఈ రంగంలో పరిశోధన, పెట్టుబడులు పెట్టేవారిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూదానికి పాల్పడే వాళ్లు, ఈ గేమర్లను ఒకేలా చూడకూడదని మరికొందరు పేర్కొన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయం కారణంగా కొత్త గేమ్‌లు మరియు టెక్నాలజీ అభివృద్ధి చేసే సామర్థ్యం దెబ్బతింటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. 28 శాతం జీఎస్టీ కారణంగా మార్కెట్‌లో పోటీతత్వం దెబ్బతింటుందని తెలిపారు. మార్కెట్ విస్తరణకు పెద్ద ఆటంకం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జీఎస్టీ కౌన్సిల్ ఆన్‌లైన్ గేమింగ్‌లో నైపుణ్యం లేదా అదృష్టం అనే భేదాన్ని తాము చూడడం లేదని, మొత్తం విలువ ఆధారంగా ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ అంశంపై గేమింగ్ సంస్థలు.. కోర్టులను ఆశ్రయిస్తే ప్రభుత్వం కూడా న్యాయపోరాటానికి సిద్ధంగా ఉందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








